హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఎన్నికల్లో నా ఓటమికి కారణాలు అవే.. ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తా : రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆ ఎన్నికల్లో నా ఓటమికి కారణాలు అవే.. ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తా : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పదవుల కోసం తాను ఎన్నడూ పరుగెత్తలేదన్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుకను వినిపించడమే తనకు ఇష్టమని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీగా అక్కడి ప్రజల గొంతును పార్లమెంట్‌లో వినిపిస్తానని చెప్పారు. కొడంగల్‌లో తనను అధికార, ధన బలంతో ఓడించారని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ తనకు మద్దతిచ్చిన సీపీఐ నేతలకు రేవంత్ రెడ్డి కృ‌తజ్ఞతలు తెలిపారు. ఆ మేరకు మంగళవారం హిమాయత్ నగర్‌లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కమ్యూనిస్ట్‌ సోదరుల ఆలోచనను కొనసాగించేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో ఆ పార్టీకి స్థానం లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ పార్టీ తరపున తాను ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

revanth reddy hot comments on ktr and trs

---------------------

టీఆర్ఎస్ ఎంపీలు దద్దమ్మల్లా పనిచేశారు.. మేం ముగ్గురమేంటో చూపిస్తాం : కోమటిరెడ్డిటీఆర్ఎస్ ఎంపీలు దద్దమ్మల్లా పనిచేశారు.. మేం ముగ్గురమేంటో చూపిస్తాం : కోమటిరెడ్డి

పనిలోపనిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ లో కవిత ఓటమిని అంగీకరించకుండా.. మల్కాజిగిరిలో తన గెలుపు గెలుపు కాదని ఆయన సిగ్గులేకుండా మాట్లాడటం సరికాదన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదిరించగలిగే నేతలనే ప్రజలు గెలిపించాలని కోరారు.

వచ్చే మూడు నెలల కాలంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో కార్యాలయం ఓపెన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఉదయం 9 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Malkajgiri Congress MP Revanth Reddy Hot Comments On TRS Leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X