congress mp revanth reddy sonia gandhi rahul gandhi చీఫ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సోనియాగాంధీ రాహుల్ గాంధీ
tpcc race: రథసారథి రేవంత్ రెడ్డే..? కానీ ఈ రెండే అడ్డంకులు
టీ పీసీసీ చీఫ్ పదవీ కోసం నేత ఎంపిక ప్రక్రియ కొనసాగు...తోంది. రకరకాల కారణాలతో ప్రకటన ఆలస్యమవుతోంది. పీసీసీ చీఫ్ కోసం రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉన్నారు. ఆయనకు పట్టం కట్టబెట్టాలని హై కమాండ్ కూడా భావిస్తోంది. కానీ ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ప్రకటన వాయిదాల పర్వం కంటిన్యూ అవుతోంది. న్యూ ఇయర్‌లో పీసీసీ చీఫ్ ప్రకటించే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డికే అవకాశం..
తెలంగాణ టీపీసీసీ చీఫ్ పదవీ కోసం రేవంత్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గత కొద్దిరోజులగా ప్రచారం కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చే విషయంలో ఓ వర్గం సుముఖంగా లేదు. బాహాటంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో వారిని బుజ్జిగించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. అందరినీ ఒప్పించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్ ఉంది.

అనుకూలంగా.. ఎందుకంటే..
రేవంత్ రెడ్డి విషయంలో సామాజిక సమీకరణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇదివరకు సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అదే అభిప్రాయం చెప్పారు. అయితే తెలంగాణలో బీసీలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ వర్గానికి చెందిన నాయకులు అనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ఆలోచిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరోసారి ఆ వర్గానికే టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడమా ? లేక మార్పు చేయడమా అనే కోణంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందనే వాదన ఉంది.

ప్రత్యామ్నాయం.. బీసీ, ఎస్సీ
టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడమా లేక బీసీ లేదా ఎస్సీ వర్గంలో ఒక నేతను ఎంపిక చేయడమా అనే ఆప్షన్స్‌ను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా బలహీనపడుతోందని కూడా గమనించింది. కొత్త నేత ఎంపిక విషయంలో అన్ని కోణాలను పరిశీలిస్తోందని కొందరు నేతలు చెబుతున్నారు.

ఖాయమే కానీ..
క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు ఇతరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని సమాచారం. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వడంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీని బలంగా ఎదుర్కొగలదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డికి దాదాపుగా టీపీసీసీ చీఫ్ పదవీ ఖాయం అని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ఓ వర్గం వ్యతిరేకతతో ఆలస్యమవుతోంది.