హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీకు పెళ్లిళ్లు కావాలంటే ఆయన్ని ఇంటికి పంపాల్సిందే.. యువత పెళ్లిళ్లు, కేసీఆర్ కు రేవంత్ లింకు

|
Google Oneindia TeluguNews

యువత పెళ్లిళ్లకు, గులాబీ పెద్దాయనకు లింక్ పెట్టారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ బాస్ పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న ఈ యువనేత పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మీకు పెళ్లిళ్లు జరగాలంటే ఆ ఒక్కడ్ని ఇంటికి పంపండంటూ ప్రచారం చేస్తున్నారు.

పెళ్లిళ్లేంటి.. కేసీఆర్ కు లింకేంటి అనుకుంటున్నారా? ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులకు కేసీఆర్ మూలంగా పెళ్లిళ్లు జరగడం లేదనేది రేవంత్ మాటల సారాంశం. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాట తప్పారని మండిపడుతున్నారు.

కేసీఆరే కారణం..!

కేసీఆరే కారణం..!

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ టార్గెట్ గా మాటల దాడికి దిగుతున్నారు రేవంత్ రెడ్డి. అన్నీ అంశాలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్న రేవంత్.. యువత పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ మాట నమ్మి ఓట్లేస్తే.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు.. పెళ్లిళ్లు చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నౌకరీ వచ్చేదాకా పెళ్లిళ్లు ఎందుకని దాటవేస్తున్నారని.. ఇదంతా ఆ ఒక్కడి మూలంగానే జరుగుతోందని ఫైరవుతున్నారు. ఆ ఒక్కడిని ఇంటికి పంపిస్తే మీ అందరికీ పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పుకొస్తున్నారు.

మేమొస్తే మీకు పెళ్లిళ్లు..!

టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు లక్షా ఏడువేల ఉద్యోగాల ఖాళీలు ఉండేవని.. కేసీఆర్ వచ్చాకా మరో లక్ష ఉద్యోగాలకు ఖాళీలు ఏర్పడ్డాయని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ నాలుగేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ కు చిమ్మకుట్టినట్లైనా లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్షా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి టీచర్ల నియమకాలు చేపడతామంటున్నారు.

రేవంత్ వ్యాఖ్యలకు చప్పట్ల వర్షం

రేవంత్ వ్యాఖ్యలకు చప్పట్ల వర్షం


ఉద్యోగాలు, కేసీఆర్, యువత పెళ్లిళ్లు.. ఈ అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ ఒక్కడిని ఇంటికి పంపిస్తే మీకు (నిరుద్యోగులు)పెళ్లిళ్లు అవుతాయంటూ ప్రసంగిస్తుండటంతో చప్పట్ల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆ ఒక్కడు ఎవరంటూ రేవంత్ రెడ్డి అడుగుతుండటం.. కేసీఆర్, కేసీఆర్ అంటూ జనాల్లోంచి సమాధానం రావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

English summary
Congress Working President Revanth Reddy has links to the youth marriages and KCR. He saying that in election campaign, If you want to get married, you have to send him to home. Also he claimed that The unemployed youth roaming around coaching centres due to no job notifications with the reason of KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X