హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్! వారికీ కోతలేనా? ఇది ఎంత మాత్రమూ సరికాదంటూ రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని, అయితే, తాము వాటిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.

మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి..

మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి..

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రాసిన బహిరంగలేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. కరోనావైరస్ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని రేవంత్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మరిన్ని కఠని చర్యలు తీసుకోవాలని అన్నారు.

కేసీఆర్.. ఇదేంపని..?

కేసీఆర్.. ఇదేంపని..?

సామాజిక దూరం(సోషల్ డిస్టాన్స్) పాటించమని చెబుతూనే మరోవైపు ఫార్మాసిటీ భూసేకరణకు రంగారెడ్డి జిల్లా మేడిపల్లి నానక్‌రాంగూడ గ్రామ పరిధిలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 3న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించనున్నట్లు నోటీసులో అధికారులు పేర్కొన్నారని తెలిపారు. అధికారికంగా 14 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండగా ఏప్రిల్ 3న సభ నిర్వహించడం సరికాదన్నారు. సభ కారణంగా జనం గుంపులుగా చేరడంతో వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుందన్నారు.

వారి జీతాల్లోనూ కోత విధించడమా?

వారి జీతాల్లోనూ కోత విధించడమా?

ఇక ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే చిరుద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించడం సరికాదని రేవంత్ వ్యాఖ్యానించారు. అంతేగాక, కరోనా వ్యాపిస్తున్న వేళ వైద్య, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రోత్సహకాలు ఇవ్వాల్సిందిపోయి జీతాల్లో కోత పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది వారి నిబద్ధతను తక్కువ చేయడమే అవుతుందన్నారు.

సర్కారు మరోసారి సమీక్షించాలి..

సర్కారు మరోసారి సమీక్షించాలి..


ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని రేవంత్ రెడ్డి తన లేఖలో కోరారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆదాయం రాబడి లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

English summary
congress mp revanth reddy questions cm kcr on government staff salary cut amid lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X