హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీతో జతకట్టిన కేసీఆర్.. అందుకే ఫామ్‌హౌస్‌కే పరిమితం: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం చేయకుంటే వారి ఉసురు తగులుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి సోమవారం రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై దుమ్మెత్తిపోశారు.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్నా పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. వారి సాధక బాధకాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. కానీ ఏమీ పట్టనట్టు ఉండటం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని.. సమయం సమీపిస్తే ప్రేమ ఒలకబోస్తారని చెప్పారు.

revanth reddy slams central government

పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి మోడీతో కేసీఆర్ జతకట్టారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతును నొక్కేశారని మండిపడ్డారు. ఢిల్లీలో రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
congress mp revanth reddy slams central government on farm laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X