హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరెస్ట్ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరిగింది.. ఆయన భార్య ఏమన్నారు?(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆరోపణలు| Oneindia

కొడంగల్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజామున పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొడంగల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి సతీమణి గీత సైతం పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు సరికాదని మండిపడ్డారు గీత. తామేమైనా తీవ్రవాదులమా అంటూ ఉద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

తీవ్రవాదులమా?.. ఏంటి ఈ పోలీసుల తీరు : గీత

తీవ్రవాదులమా?.. ఏంటి ఈ పోలీసుల తీరు : గీత

రేవంత్ రెడ్డిపై పోలీసులు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు ఆయన సతీమణి గీత. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమంటూ ఫైరయ్యారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఆమె తప్పుబట్టారు. తీవ్రవాదులను, నేరస్థులను లాక్కెల్లినట్లు

తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి భార్య గీత డిమాండ్‌ చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తీవ్రవాదని ఈడ్చుకెళ్లినట్టు బలవంతంగా లాక్కెల్లి వాహనంలో తీసుకుపోయారని, ఎక్కడి తరలిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తామేమన్నా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు.

సంయమనం పాటించండి.. నియంత పాలనకు చెక్ పెట్టండి : గీత

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఎవరూ ఎంత రెచ్చగొట్టాలని చూసినా సంయమనం పాటించాలని.. ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇదంతా కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

కొడంగల్ లో టెన్షన్ టెన్షన్

కొడంగల్ లో టెన్షన్ టెన్షన్

కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల కేసీఆర్ ఇక్కడికి ఎట్లోస్తావో చూస్తామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈనేపథ్యంలో తెల్లవారుజామున రేవంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు ఆయనతో పాటు సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరందర్నీ జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించినట్లు సమాచారం. అదలావుంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కొడంగల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది.

English summary
Revanth Reddy wife geetha fired on his arrest by the police. She questioned that how came the police into our home without any prior information. Are we terrorists, she claimed the police. The activists wanted to compassion and vote for the appropriate mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X