హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

tpcc race: కాంగ్రెస్‌లో సారథి కుంపటి.. వీహెచ్‌ను బెదిరించిన రేవంత్ అభిమాని అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పోస్టు కుంపటి పెట్టింది. నేతలు/ వర్గాలుగా విడిపోయారు. ఇక వారి అభిమానులకు హద్దే లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ రెడ్డికి వస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో వీ హనుమంతరావు ఒకరు.. అయితే వీహెచ్‌పై రేవంత్ అభిమానికి కోపం వచ్చింది. ఫోన్ చేసి మరీ బెదిరించాడు. దీంతో వీహెచ్ పోలీసులను ఆశ్రయించగా.. ఇవాళ అతనిని అరెస్ట్ చేశారు.

Recommended Video

Congress leader V Hanumantha Rao wrote to Telangana DGP M Mahender Reddy requesting security
రేవంత్ అభిమాని అరెస్ట్..

రేవంత్ అభిమాని అరెస్ట్..

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు బెదిరింపు ఫోన్ చేసి బెదరించిన ఎంపీ రేవంత్‌రెడ్డి అభిమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వరంగల్‌ కాశిబుగ్గకు చెందిన కమల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 25వ తేదీన వీహెచ్‌కు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయంపై సైబరాబాద్ సీపీ, డీజీపీకి వీహెచ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీహెచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కమల్‌ను అరెస్టు చేశారు.

 మాట్లాడితే చంపుతా..

మాట్లాడితే చంపుతా..

కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతామని వీహెచ్‌కు బెదిరింపులు వచ్చాయి. దాంతో సైబరాబాద్‌ పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేసి.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే పార్టీ హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్టు వస్తున్న వార్తలపై హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ మొదైలంది.

పార్టీలో ఉండనని కామెంట్ చేయడంతో

పార్టీలో ఉండనని కామెంట్ చేయడంతో

రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే.. తాను పార్టీలో ఉండనని కూడా వీహెచ్ స్పష్టం చేశారు. తనతో పాటు చాలా మంది ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి కూడా పనికి రారా అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీ పీసీసీ చీఫ్‌ పదవి ఇస్తారా అని వీహెచ్ మండిపడ్డారు. తర్వాతే కమల్ ఫోన్ చేశారు. రేవంత్ గురించి మాట్లాడొద్దు అని బెదిరించారు.

English summary
congress mp Revanthreddy fan kamal arrested by police for threatening senior congress leader vh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X