హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేనా... రౌడీనా....? ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీషీట్ ఓపెన్....!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పై తాజాగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడిషీటర్ల జాబితాలో ముషిరాబాద్ ఎమ్మెల్యే పేరును చేర్చారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తన పేరును రౌడిషీటర్ల జాబితాలో చూసి చాల బాధపడ్డానని అన్నారు. ప్రజాసేవ చేస్తూ... రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను రౌడీషీటర్‌గా పేర్కోనడం అత్యంత దారుణమని అన్నారు.

Disha murder: దిశ ఘటన నిందితులు నా నుండి తప్పించుకోలేరన్న రాజా సింగ్ ..కేసు నమోదు Disha murder: దిశ ఘటన నిందితులు నా నుండి తప్పించుకోలేరన్న రాజా సింగ్ ..కేసు నమోదు

పోలీసులు కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని... అయితే టీఆర్ఎస్‌లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం రౌడీషీటర్లని వారి పేర్లను రౌడీషీట్లో పెట్టే దమ్ము పోలీసులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దీంతో తాను ఎమ్మెల్యేనో.. రౌడిషిటర్‌నో ముఖ్యమంత్రి లేదా.. హోమంత్రి సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Rowdy Sheet was opened on BJP MLA Raja Singh

కాగా బీజేపీ నుండి రెండవసారి గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. మత ఘర్షణలతో పాటు హిందూ అనుకూల సంఘటనల్లో ఎప్పటికప్పుడు చురుకుగా పాల్గోంటున్నారు. పార్టీ అధినాయత్వం అనుమతి ఉన్నా... లేకున్నా...ఆయన హిందుత్వ వైపు అంటూ పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది.

English summary
recently rowdysheet was opened on BJP MLA Raja Sing in mangalhat police staion in hyderabad. MLA has fires at the police of rowdysheet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X