హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం: కేసీఆర్ లక్ష్యంగా కామెంట్స్, బానిస బతుకులు మారాలంటూ

|
Google Oneindia TeluguNews

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వరం పెంచారు. రాజకీయాల్లోకి వస్తా అంటూనే విమర్శలు సంధిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. దళిత సీఎం అంటూ మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదు కాగా.. దానిపై కూడా స్పందించారు. తనపై కేసు పెట్టినంత మాత్రానా భయపడబోనని చెప్పారు.

Recommended Video

Manda Krishna Madhiga blamed TRS MLA Rasamai Balakishan for being the cultural captain
ఓట్ల కోసం జిమ్మిక్

ఓట్ల కోసం జిమ్మిక్

ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. మోసగించారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు.

సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలో గల ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని సీఎం కేసీఆర్‌ను ఇండైరెక్టుగా విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇకనైనా బతుకులు మారాలి..

ఇకనైనా బతుకులు మారాలి..

బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు.

రాజీనామా చేసిన మరుసటిరోజే తనపై కేసు పెట్టారని, ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. నిజమైన అభివృద్ధి, అధికారం కావాలి. బహుజన రాజ్యం స్థాపించుకుందాం. మళ్లీ వెయ్యేళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. మీ బిడ్డగా ప్రశ్నించడానికి వచ్చాను. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే ధైర్యం రావాలని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

2 శాతం ప్రొఫెసర్లు

2 శాతం ప్రొఫెసర్లు

దేశంలో ఉన్న వర్సిటీల్లో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారని... పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందామని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఇటు ప్రవీణ్‌కుమార్‌ రాజకీయా ల్లోకి రావాలంటూ స్వేరో స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రతి నిధులు భువనగిరి నుంచి హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వరకు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు.

English summary
rs praveen kumar slams cm kcr on dalit cm and development issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X