హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతికూల పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక పోరాటం .. చివరకు జరిగేదేంటి అన్న అంతర్మధనం

|
Google Oneindia TeluguNews

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల పోరాటం సాగుతుంది. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి లా ఉంది. కార్మికులు సమ్మెను కొనసాగించినా ఫలితం ఉండేలా లేదు. అలాగని సమ్మెను విరమించినా సీఎం కేసీఆర్ కనికరించేలా లేరు. మొత్తానికి ఆర్టీసీ కార్మిక లోకం హైకోర్టు ఇస్తున్న వరుస తీర్పులతో పరేషాన్ లో పడింది. ఆర్టీసీ కార్మిక జెఎసికి సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అంతర్మధనంలోనే పోరాటం సాగిస్తుంది.

మరో ఆర్టీసీ కార్మికుడు మృతి .. శవంతో బైటాయించిన కార్మికులు .. పరిగి డిపోలో ఉద్రిక్తతమరో ఆర్టీసీ కార్మికుడు మృతి .. శవంతో బైటాయించిన కార్మికులు .. పరిగి డిపోలో ఉద్రిక్తత

 లేబర్ కోర్టులోకి ఆర్టీసీ సమ్మె కేసు బదలాయించటంతో మారిపోయిన సీన్

లేబర్ కోర్టులోకి ఆర్టీసీ సమ్మె కేసు బదలాయించటంతో మారిపోయిన సీన్


లేబర్ కోర్టులోకి ఆర్టీసీ సమ్మె కేసు బదలాయించటంతో ఆర్టీసీ సమ్మె సీన్ మారిపోయింది. ఆర్టీసీ కార్మికుల సమస్యను లేబర్ కోర్టు పరిష్కరిస్తుందని చెప్పిన హైకోర్టు, రెండు వారాల్లోగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేబర్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే హైకోర్టు పరిష్కరించలేని సమస్య లేబర్ కోర్టు పరిష్కరిస్తుందా అని ఆర్టీసీ కార్మికులు ఆవేదన మొదలైంది. దీంతో ప్రభుత్వం బేషరతుగా విధుల్లో తీసుకుంటే సమ్మె విరమిస్తానని ప్రకటన చేశారు.

 సమ్మె విరమణ .. యూటర్న్ తీసుకుని మళ్ళీ కొనసాగింపు .. జేఏసీ కన్ఫ్యూజన్

సమ్మె విరమణ .. యూటర్న్ తీసుకుని మళ్ళీ కొనసాగింపు .. జేఏసీ కన్ఫ్యూజన్


కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇక మరోపక్క ఇన్ని రోజులు పోరాటం చేసి, ఇంత మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఒక డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా సమ్మెను విరమించడం తప్పని కొన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటనను వ్యతిరేకించాయి. దీంతో మరోమారు యూటర్న్ తీసుకుని ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె కొనసాగిస్తామని ప్రకటించింది. సమ్మె విరమణ చేస్తామని చెప్పిన స్పందించని కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ తీరు కార్మిక లోకానికి విస్మయాన్ని కలిగించింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

ఇక ఇదే సమయంలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పై హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ చట్ట వ్యతిరేకమని వేసిన పిటీషన్ ను కొట్టి వేసి ఆర్టీసీ కార్మికులకు మరోమారు షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు తీసుకోవడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులకు మరో గట్టి దెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వ వాదనలను విన్న తరువాత తాము కేబినెట్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది.

రెండు సార్లు ఆర్టీసీ కార్మికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ కొట్టిన కోర్టు తీర్పులు

రెండు సార్లు ఆర్టీసీ కార్మికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ కొట్టిన కోర్టు తీర్పులు

మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 102 ప్రకారం ప్రభుత్వానికి ఆ అధికారాలున్నాయని, ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని ఏజీ స్పష్టం చేయటం ఆర్టీసీ కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికే రెండుసార్లు హైకోర్టులో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగక పోవడం, లేబర్ కోర్టు లో కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం లేకపోవడం ఆర్టీసీ కార్మికులకు అశనిపాతంగా మారింది.రెండు సార్లు ఆర్టీసీ కార్మికుల ఆత్మ స్థైర్యాన్నికోర్టు తీర్పులు దెబ్బ కొట్టాయి.సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరదామన్నా అవకాశం లేని స్థితిలో చివరి వరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు ఆర్టీసీ కార్మికులు.

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మిక పోరాటం

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మిక పోరాటం

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మిక పోరాటం సాగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికులకు అండగా పోరాటం చేస్తామని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం మెడలు వంచటంలో ఫెయిల్ అయినట్టు గా తెలుస్తుంది. అంతేకాదు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిరంకుశంగా వ్యవహరించి, రాష్ట్రంలోని ఇతర శాఖల ఉద్యోగులకు ఒక ఇండికేషన్ ఇవ్వాలన్న నిర్ణయం తో ముందుకు వెళ్తున్నారు.

Recommended Video

TSRTC Samme : ఆర్టీసీ కార్మికులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..! || Oneindia Telugu
చివరకు ఏం జరుగుతుందో అర్ధం కాని అంతర్మధనం

చివరకు ఏం జరుగుతుందో అర్ధం కాని అంతర్మధనం

ఇక అందులో భాగంగానే ఆర్టీసీ కార్మికులు అడుగడుగునా ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది ఆర్టీసీ కార్మికులు మరణించినా ప్రభుత్వం స్పందించకపోవడం, ఆర్టీసీ కార్మికుల ఆందోళన ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇంతగా పోరాటం చేసిన, పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు చివరకు మిగిలేది ఏంటో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంతర్మధనంలో ఆర్టీసీ కార్మికులున్నారు.

English summary
The struggle of the RTC workers in the face of adverse conditions prevails. Workers continue the strike but the result is not guaranteed. However, the KCR did not pity the strike. To sum up, the RTC workers are in now danger zone with a series of rulings by the High Court. RTC labor JAC thinking about how to over come the current situation. The fight goes on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X