హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సై అంటున్నారు. డిమాండ్ల సాధనకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. బెట్టు దిగని కార్మిక సంఘాల తీరుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా మెట్టు దిగనంటోంది. ఎంతవరకు వెళతారో చూస్తాం అన్నట్లుగానే సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు, ప్రభుత్వానికి మధ్య చర్చలు లేని పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం దిగి రావాల్సిందే అంటూ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంటే.. అటు సీఎం కేసీఆర్ సరికొత్త ఎత్తుగడకు తెర తీయడం చర్చానీయాంశంగా మారింది.

 ఆర్టీసీ సమ్మె.. దిగిరాని ప్రభుత్వం.. మరింత ఉధృతమా..!

ఆర్టీసీ సమ్మె.. దిగిరాని ప్రభుత్వం.. మరింత ఉధృతమా..!

26 డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉధృతంగా మారనుంది. ప్రభుత్వం ఎంతకూ దిగి రాకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో పాటు పొలిటికల్ లీడర్ల మద్దతు కోరుతున్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ ఆర్టీసీ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.

50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీరు ఇలా

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీరు ఇలా

ఆర్టీసీ సమ్మెపై మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఖరాఖండిగా వ్యవహరిస్తోంది. అసలు ఈ సమ్మె చట్ట సమ్మతం కాదని వాదిస్తోంది. ఆ క్రమంలో కార్మికులు సమ్మె తలపెట్టిన మరునాడు సాయంత్రం ఆరు గంటల లోపు విధుల్లో చేరాలని.. లేదంటే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించింది. అయినా కార్మికులు జంకలేదు. ఏదో కొద్ది శాతం ఉద్యోగులు సరెండర్ అయినప్పటికీ.. ఆర్టీసీ సమ్మె మాత్రం ఆగలేదు. గురువారం నాటితో ఆరో రోజుకు చేరిన ఈ సమ్మెను ప్రభుత్వం నీరుగార్చాలని ఆలోచిస్తుందే తప్ప.. కార్మికుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయడం లేదని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆనాడు వెన్నుదన్నుగా నిలిస్తే.. ఈనాడు కనికరం లేదా?

ఆనాడు వెన్నుదన్నుగా నిలిస్తే.. ఈనాడు కనికరం లేదా?


తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఆర్టీసీ కార్మికులను ఈనాడు ఆయన విస్మరించడం తగదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల నేతలను కలిసి మాట్లాడకుండా నియంతలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ పరిరక్షణకు, మనుగడకు ఎంతవరకైనా తెగిస్తామని.. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.

 ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఇప్పుడే ఎందుకీ నిర్ణయం..!

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఇప్పుడే ఎందుకీ నిర్ణయం..!

అదలావుంటే సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేసే ప్రయత్నాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఫైరవుతున్నారు జేఏసీ నేతలు. ఆ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతు ఇవ్వకుండా కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరే క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో కార్యాలయానికి చేరుకునే లోపే కేసీఆర్ కొత్త నిర్ణయం ప్రకటించడం చర్చానీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేసీఆర్.. వారికి కరవుభత్యం (DA) 3.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇతర శాఖల ఉద్యోగులు ఆర్టీసీ జేఏసీ నేతలకు సపోర్ట్‌గా నిలవకుండా కేసీఆర్ ఇలాంటి ఎత్తుగడ వేశారనే వాదనలు కొకొల్లలు.

ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు విచారణ.. ప్రభుత్వానికి ప్రశ్నల వర్షంఆర్టీసీ సమ్మె.. హైకోర్టు విచారణ.. ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం

ఆర్టీసీ సమ్మె పరిష్కరించకుండా.. ఈ డీఏ పెంచడమేంటో?

ఆర్టీసీ సమ్మె పరిష్కరించకుండా.. ఈ డీఏ పెంచడమేంటో?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.5 శాతం డీఏ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం వారికి తీపి కబురు అందించినప్పటికీ.. మరోవైపు కేసీఆర్ పోకడలపై దుమారం రేగుతోంది. ఒకవైపు సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. వారితో మాట్లాడి ఏదో ఒకటి చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. ముందు పెద్ద సమస్య పెట్టుకుని.. ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం లేని ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడమేంటనేది సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్నారు.

English summary
Trade unions JAC leaders are preparing for the future action of the government should come down on the RTC strike. But KCR thinking differently. He announced DA 3.5 percent to state government employees to check rtc strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X