హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛలో ట్యాంక్ బండ్ పై అణచివేత..! ఫ్లై ఓవర్ల మూసివేత..! నగరం నుండి కార్మికుల గెంటివేత..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె 37వ రోజుకు చేరుకుంది. గత 37 రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు ఆర్టీసి కార్మికులు. వంటా వార్పు, మానవహారాలు, కుటుంబ సభ్యులతో నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధం తదితర కార్యక్రమాలతో ప్రభుత్వంపైన వ్యతికరేకత బహిర్గతం చేస్తునే ఉన్నారు. ఇక శనివారం లక్ష మందితో ఛలో ట్యాక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆర్టీసి జేఏసి ప్రభుత్వంపైన ప్రత్యక్ష పోరాటానికి తెర తీసింది.

TSRTC STRIKE:9న ఛలో ట్యాంక్‌బండ్, డిపోల వద్ద దీక్షలు, నిరసనలు, ఇదీ ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ..TSRTC STRIKE:9న ఛలో ట్యాంక్‌బండ్, డిపోల వద్ద దీక్షలు, నిరసనలు, ఇదీ ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ..

 ఛలో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం.. కార్మికులను అడ్డుకున్న పోలీసులు..

ఛలో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం.. కార్మికులను అడ్డుకున్న పోలీసులు..

కార్మికులు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి లేదంటూ, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో చేరితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఐతే తాము ఎలాగేనా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని జేఏసీ నేతలు ప్రకటించారు. వీరికి అండగా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తే అవకాశం ఉందని బావించిన పోలీసులు ఆర్టీసి కార్మికులను అరెస్టు చేసారు. నగరం నలు వైపుల గట్టి నిఘా ఏర్పాటు చేసి ఉద్యోగులను ట్యాక్ బండ్ పరిసరాలకు వెళ్లకుండా నిలువరించారు.

 నగరం అష్ఠ దిగ్బంధనం.. కార్మికుల అరెస్టుతో అట్టుడికిన హైదరాబాద్..

నగరం అష్ఠ దిగ్బంధనం.. కార్మికుల అరెస్టుతో అట్టుడికిన హైదరాబాద్..

ఇదిలా ఉండగా అయోధ్య కేసు తీర్పు వల్ల తెలంగాణలో జరుగుతున్న కీలక పరిణామాలు మీడియాలో పెద్దగా కనిపించ లేదు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ను మరింత ఉదృతం చేసేందుకు శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేయాలని ఆర్టీసీ నాయకులు తలపెట్టారు. దీన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. సిటీ నలుమూలలా అష్ట దిగ్బంధనం చేసి కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు.

 రాజకీయ నేతల గృహనిర్బంధం.. నిరసన వ్యక్తం చేసిన నేతలు..

రాజకీయ నేతల గృహనిర్బంధం.. నిరసన వ్యక్తం చేసిన నేతలు..

శనివారం తెల్లవారేలోపు ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందిని అదుపులోకి తీసుకోవడం కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేతలను చాలా వరకు గృహ నిర్బంధం చేసిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హిమాయత్ గర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ నాయకులతో పాటు దీనికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నేతలను కూడా అరెస్టు చేశారు.

 సీఎం పై ఆర్టీసి ఉద్యోగుల ఆగ్రహం.. అణచివేస్తే ఉద్యమం ఆగదంటూ హెచ్చరికలు..

సీఎం పై ఆర్టీసి ఉద్యోగుల ఆగ్రహం.. అణచివేస్తే ఉద్యమం ఆగదంటూ హెచ్చరికలు..

జిల్లాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేయడమే కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌ మూసేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతా బాద్ ఫ్లై ఓవర్ తో పాటు ట్యాంక్ బండ్ కు వచ్చే రహదారులన్నీ మూసేసారు పోలీసులు. అంతే కాకుండా ట్యాంక్ బండ్ చుట్టూ నిఘా పెట్టారు. ట్రాఫిక్ మళ్లించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ట్యాంక్‌బండ్‌లో ట్రాఫిక్ ను నియత్రించారు. ఇదిలా ఉండగా ఇంతటి అణచివేతను ఎన్నడూ చూడలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలను కొనసాగిస్తామని పునరుద్గాటించారు.

English summary
The strike initiated by the RTC workers reached 37. The RTC workers have been showing their protest in various forms for the last 37 days. The RTC has opened a direct struggle against the JAC government calling for a Chalo tank bund programme on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X