హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్మికులు సమ్మె విరమించినా ...ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంటుందా ? టెన్షన్ లో కార్మిక లోకం

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మిక లోకం టెన్షన్ లో ఉంది. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. తమ సమ్మెపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, అలాగే ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చెయ్యటానికి ప్రభుత్వం సన్నద్ధం కావటంతో మొదటికే మోసం వస్తుందని భావించి ఆర్టీసీ కార్మిక జేఏసీ అర్ధాంతరంగా సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా .. లేదా అన్న డైలమాలో కార్మిక లోకం ఉంది.

ఆర్టీసీ సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మిక జేఏసీ .. విధులకు హాజరు కావాలని సూచన

ఆర్టీసీ సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మిక జేఏసీ .. విధులకు హాజరు కావాలని సూచన

కార్మికులను రేపు ఉదయం నుండి విధుల్లో చేర్చుకోవాలని కోరింది. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అంతే కాదు మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే కార్మికుల సమ్మె విరమణ ప్రకటన చేసినా సీఎం కేసీఆర్ స్పందిస్తారా ? ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందా? సమ్మె విరమించిన కార్మికులను ఆర్టీసీ విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ప్రస్తుతం కార్మికుల ముందు ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న .

కేసీఆర్ తాతా... చర్చలకు పిలవండి అని దీనంగా అడిగిన చిన్నారి.. కళ్ళు చెమర్చే సంఘటనకేసీఆర్ తాతా... చర్చలకు పిలవండి అని దీనంగా అడిగిన చిన్నారి.. కళ్ళు చెమర్చే సంఘటన

సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకుంటారా ? టెన్షన్

సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకుంటారా ? టెన్షన్

ఇప్పటికే పలు మార్లు ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. అంతే కాదు డెడ్ లైన్ కూడా విధించారు. కానీ ఆర్టీసీ కార్మిక లోకం ససేమిరా అంది. 52 రోజుల పాటు ఉద్యమాన్ని కొనసాగించింది. గతంలో ఇకపై సమ్మె చెయ్యబోమనే రాతపూర్వక హామీతో కార్మికులందరూ విధులకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించిన నేపధ్యంలో ఇప్పుడు కార్మికులు తమంతట తాము సమ్మె విరమించి వస్తే వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా అన్నది ఆర్టీసీ కార్మికులకు అంతు చిక్కకుండా ఉంది.

కేసీఆర్ ఆఫర్ బేఖాతరు చేస్తే ఇప్పుడు కేసీఆర్ కార్మిక విజ్ఞప్తి ఖాతరు చేస్తారా ?

కేసీఆర్ ఆఫర్ బేఖాతరు చేస్తే ఇప్పుడు కేసీఆర్ కార్మిక విజ్ఞప్తి ఖాతరు చేస్తారా ?


అప్పుడు ముఖ్యమంత్రి ఆఫర్‌ను నేతలు, కార్మికులు బేఖాతరు చేస్తే, ఇప్పుడు సమ్మె విరమించిన కార్మికుల అభ్యర్థనను సీఎం కేసీఆర్ ఖాతరు చేస్తారా అంటే కష్టమే అనే భావన వ్యక్తం అవుతుంది. ఇంతకాలం పోరాటం చేసినా కార్మిక పోరాటం అరణ్య రోధనలా మారిందే తప్ప ఎలాంటి మేలు జరగలేదు. పైగా దాదాపు ముప్పై మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరిన్ని ప్రమాదాలు ముంచుకువస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

మొన్న సమ్మె విరమణ.. యూ టర్న్ .. మళ్ళీ విరమణ ..

మొన్న సమ్మె విరమణ.. యూ టర్న్ .. మళ్ళీ విరమణ ..

గతంలో రెండు సార్లు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను కాదని, ఇప్పుడు విధులకు హాజరవుతామంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అంటే కష్టమే . కొద్దిరోజుల క్రితమే కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధులకు హాజరయ్యేందుకు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు క్యూ కట్టారు. కానీ ఫలితం శూన్యం వారిని విధుల్లోకి తీసుకోలేదు .అయితే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలు తమకు రాలేదని డిపో మేనేజర్లు కార్మికులను తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక మళ్లీ సమ్మె బాట పట్టారు.

 జేఏసీ వేసింది తప్పటడుగులా .. తప్పు అడుగులా చర్చ

జేఏసీ వేసింది తప్పటడుగులా .. తప్పు అడుగులా చర్చ


ఇప్పుడు యూ టర్న్ తీసుకుని రెండు రోజులైనా కాక ముందే మరోమారు పూర్తిగా సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసింది. ఇక దీంతో త్రిశంకు స్వర్గంలో కార్మిక లోకం పడింది . ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందా? సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారా లేదా? అనేది త్వరలోనే తేలనుంది. ఆర్టీసీ కార్మిక జేఏసీ పోరాటం సాగించటంలో వేసింది తప్పటడుగులా.. లేదా తప్పు అడుగులా అన్న చర్చ జరుగుతుంది.

English summary
RTC workers in Telangana is in tension. RTC workers strike lasted 52 days but CM KCR did not respond. The RTC worker JAC has announced that it will end the strike effectively, as the government has not responded to their strike and the government is preparing to privatize RTC routes. But whether the government may respond positively or not .. this is the Dilemma of RTC workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X