హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బావల కన్నా ఎక్కువ సంపాదిస్తానని: ఇంటర్ చదివి, మెకానిక్‌గా మారి.. కిడ్నాపులు, ఇదీ సాగర్..

|
Google Oneindia TeluguNews

ఎక్కడైనా ఛాలెంజ్‌లు చేస్తుంటారు. స్నేహితుల మధ్య బెట్ నడుస్తుంటాయి. రకరకాల పందెలు ఉంటుంటాయి. అయితే నిర్దేశిత సమయంలో డబ్బులు సంపాదిస్తానని కూడా చాలెంజ్ చేసే సందర్భాలు ఉంటాయి. అయితే సోదరులతో గానీ/ బావలతో కానీ చాలా అరుదుగా ఉంటాయి. అయితే చిన్నారి దీక్షిత్ కేసులో నిందితుడు శనిగపురానికి చెందిన మంద సాగర్ కూడా అలానే ఛాలెంజ్ చేశాడు. తన బావల కన్నా ఎక్కువ సంపాదిస్తానని ఛాలెంజ్ చేసి.. కిడ్నాప్‌లను ప్రవృత్తిగా మార్చుకొని ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు. కేసు దర్యాప్తు నివేదికలో చాలా అంశాలు వెలుగుచూస్తున్నాయి.

టెక్నాలజీపై మంచి పట్టు..

టెక్నాలజీపై మంచి పట్టు..

చిన్నారి దీక్షిత్ కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. అయితే అతనిని కిడ్నాప్ చేసిన 2 గంటల్లోనే చంపేశారని తొలుత తెలియగా.. దర్యాప్తు నివేదికలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సాగర్‌ వైఖరి తొలి నుంచి క్రిమినల్ అని తెలిసింది. టెక్నాలజీ మంచి పట్టుంది. ఇంటర్ చదివి మానేసి.. మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. ఈజీ మనీ కోసం కిడ్నాప్ చేసి దొరికిపోయాడు. సాగర్‌కు ఇద్దరు బావలు ఉన్నారు. వారు పోలీసు డిపార్ట్ మెంట్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారికంటే ఎక్కువ సంపాదిస్తానని చాలెంజ్ చేసి.. మాట నిలబెట్టుకోవడం కోసం కిడ్నాప్ చేశాడు.

ఇజ్రాయెల్ యాప్ డౌన్‌లోడ్

ఇజ్రాయెల్ యాప్ డౌన్‌లోడ్

టెక్నాలజీపై ఆసక్తి చూపించేవాడు సాగర్. ఏడాది క్రితం ఇజ్రాయెల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసి.. దాని సాయంతో ఓ యువతిని వేధించాడు. ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్‌తో ఎవరికీ దొరక్కుండా కాల్స్ చేయవచ్చని స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. తొలుత సాగర్‌ను ఆటపట్టించేందుకు మిత్రుడు ఇంటర్నెట్ కాల్ చేయగా, తర్వాత ఇంటర్నెట్ కాలింగ్ పై సాగర్ పట్టు సాధించాడు. సైబర్ క్రిమినల్‌లా తెలివితేటలు సంపాదించారు.

 తాతపై దాడి

తాతపై దాడి

గతంలో ఓ అమ్మాయితో పెళ్లి కుదరింది. అయితే ఆమెను ఊరి శివారుకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పెళ్లి చెడిపోయింది. కొన్నిరోజుల కిందట తాత చేయి విరగ్గొట్టాడని తెలిసింది. ఇదివరకు పోలీసు వాహనానికి డ్రైవర్‌గా కూడా పనిచేశాడట. తర్వాత సొంత మెకానిక్ షాపు నడుపుకుంటున్నట్టు తెలిసింది.

10 దేశాలకు లేఖ.. స్కైప్ ద్వారా దొరికిండిలా..

10 దేశాలకు లేఖ.. స్కైప్ ద్వారా దొరికిండిలా..

డింగ్‌ టోన్‌ యాప్‌ ద్వారా సాగర్ కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. డింగ్‌ టోన్‌ యాప్‌ కోసం 10 దేశాల యాప్‌ కంపెనీలకు పోలీసుల లేఖలు రాశారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌తో డింగ్‌టోన్‌ యాప్‌‌ను సాగర్ ఆపరేట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా డింగ్‌టోన్‌ యాప్‌‌ను సాగర్ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. లెట్స్ ట్రాక్‌ పర్సనల్‌ మెగా జీపీఎస్‌ డివైజ్‌ ద్వారా సాగర్ ఫోన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇంటర్నెట్ కాల్ చేయగా గుర్తించడం వీలు కాలేదు. కానీ స్కైప్ కాల్ చేయడంతో దొరికిపోయాడు. దీక్షిత్ రెడ్డి తండ్రి తీసుకొచ్చిన నోట్లు పరిశీలనగా చూసేందుకు స్కైప్ కాల్ చేసి దొరికిపోయాడు. స్కైప్ లో అతడి ఫోన్ నెంబర్ డిస్ ప్లే కావడంతో పోలీసులు పట్టుకున్నారు.

English summary
manda sagar challenge to his brother-in-laws for earning money. then kidnap deekshith reddy and murdered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X