హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శబరిమల ఘటనపై నిరసన.. అయ్యప్ప భక్తుల కాలినడక..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ఎంట్రీ వివాదస్పదంగా మారింది. తెల్లవారుజామున 40 ఏళ్ల లోపు వయసుగల కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు. తొలిసారిగా ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలకు దిగుతున్నారు.

బుధవారం తెల్లవారుజామున శబరిమలలో జరిగిన ఘటనను.. హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు తీవ్రంగా ఖండించారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు.. అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం సరికాదని తప్పుబడుతున్నారు. ఈమేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. సైదాబాద్ నుంచి వందలాది సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం.. శబరిమలను కాపాడుకుందాం అనే నినాదంతో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.

saidabad ayyappa devotees protest
English summary
Two women entering the Sabarimala temple were severely condemned by the initiatives of Ayyappa devotees from saidabad in Hyderabad. Hundreds of pilgrims started walk from Saidabad to Tahasildar office. They given memorandum to MRO with a slogan of Let us respect our traditions and protecting Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X