India
 • search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

sam:ఏంటీ ఇలా.. మాజీ భర్తకు నో.. శునకానికి మాత్రం సెలబ్రేషన్స్, నెటిజన్స్ ఫైర్

|
Google Oneindia TeluguNews

సమంత, చైతన్య.. వారిద్దరూ విడిపోయారు. దూరం దూరంగానే ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగా ఉంటున్నారు. అవును వాళ్లిదరూ.. ముఖ్యంగా సమంత టచ్‌లో ఉన్నారు. తనకు సంబంధించి ప్రతీ విషయాన్ని షేర్ చేస్తున్నారు. తాజా తన కుక్క బర్త్ డే వేడుకలను కూడా షేర్ చేసుకున్నారు. అయితే చై బర్త్ డే రోజున కనీసం విష్ కూడా చేయలేదు. వాస్తవానికి విడిపోయాక.. కొందరు మాట్లాడుతారు.. మరికొందరు అలా ఉండరు.. కానీ వీరిద్దరూ స్టార్స్ అయినందున వారు ఏం చేసినా సంచలనమే అవుతుంది.

 ఆగ్రహాం

ఆగ్రహాం

సమంతా నెటిజన్లకు ఆగ్రహం తెప్పించారు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే ఉన్నారు. ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసిన సంగతి తెలిసిందే. దేశ, దేశాలకు స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసి.. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం ఆపడం లేదు.

 మాజీ భర్త

మాజీ భర్త


రోజూ ఏదో ఒక పోస్ట్ పెట్టాల్సిందే. తాజాగా మాజీ భర్త నాగ చైతన్య బర్త్ డే అన్న సంగతి తెలిసిందే. చై పుట్టినరోజుకు ఇటు ఫ్యామిలీతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు బర్త్‌డే విషెష్ తెలియచేశారు. సమంత మాత్రం చైకి ఎలాంటి విషెష్ తెలపలేదు. నెటిజన్లు కూడా పోనీలే పాపం ఎంతయినా వాళ్ళ ఇద్దరికీ సెట్ కాకేకదా విడిపోయింది.. ఇంక విషెష్ ఎలా చెప్తార్లే అని సర్దుకుపోయారు.

కుక్కకు ఇచ్చిన గౌరవం..

కుక్కకు ఇచ్చిన గౌరవం..

మరుసటి రోజే సామ్ తన పెంపుడు కుక్క 'హాష్'కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. దానితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసి స్పెషల్ గా విషెష్ చెప్పింది. దీంతో కొందరు నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. పెంపుడు కుక్కకు ఇచ్చిన ప్రాధాన్యత, మాజీ భర్తకి ఇవ్వలేవా అంటూ సామ్‌నే అడిగేస్తున్నారు. మొన్నటి వరకు భర్త, కో స్టార్ కూడా.. కనీసం ఒక ఫ్రెండ్ లాగా కూడా చెప్పలేకపోయావా అని నిలదీస్తున్నారు. సామ్ కావాలనే ఇలా చేస్తుందని డై హార్డ్ అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు.

  Tollywood Top 10 Heroines List || Oneindia Telugu
  ఇదీ నేపథ్యం

  ఇదీ నేపథ్యం

  అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతమ్ గే అని.. సమస్యే లేదని కొట్టి పారేశారు. అయినా వారిద్దరూ విడిపోయారు. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు తన విషయాలను షేర్ చేస్తున్నారు.

  English summary
  actress samantha dont wish to naga chaitanya for his birthday. but she grand celebrations her pet birthday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X