హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

sam-chay:చైతు గుర్తులు చెరిపేస్తోన్న సమంత.. ఫోటోలు డిలేట్

|
Google Oneindia TeluguNews

సమంత- నాగ చైతన్యల బంధం ముగిసింది. సోషల్ మీడియాలో చై, సామ్‌తోపాటు మరికొందరు చేసే ట్వీట్స్ మరింత రచ్చగా మారి చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానెళ్ల మీద సామ్ పరువు నష్టం కేసులు కూడా పెట్టింది. ఇక బంధం నుండి విడిపోయినా.. ఆ బాధ నుండి బయటపడేందుకు సామ్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

కొత్త జీవితం..

కొత్త జీవితం..

ఆధ్యాత్మిక స్థలాల నుంచి వివిధ దేశాలకు సామ్ స్నేహితులతో విహారయాత్రలు చేస్తూ మళ్ళీ సాధారణ జీవితాన్ని ప్రారంభించే పనిలో ఉంది. చైతూ మాత్రం ఎక్కడా బయట కనిపించడం లేదు. బ్రేకప్ అనంతరం ఆ బంధం నుంచే కాదు చైతూ గుర్తులను కూడా చెరిపేసి పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది సామ్. దీని కోసం గతంలో సోషల్ మీడియాలో పంచుకున్న చైతూ స్వీట్ మెమొరీస్ తొలగించేస్తుంది.

80 ఫోటోలు డిలేట్

80 ఫోటోలు డిలేట్

విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్ తన ఇనిస్టా ఖాతా నుండి చైతూతో కలిసి ఉన్న దాదాపు 80 ఫోటోలను తొలగించేసిందని తెలుస్తోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పెట్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలు మినహా సామ్-చైతూ ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మెల్ల‌గా ఒక్కొకటి తన ఇనిస్టాలో లేకుండా తొల‌గిస్తున్న‌ట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొన్నిరోజులకి తన ఖాతాలో ఎక్కడ చైతూ గుర్తులు లేకుండా చెరిపేయడం ఖాయమని అందరూ అంటున్నారు. ఇంటర్నెట్ నిండా ఈ స్టార్ కపుల్స్ ఫోటోలే ఉన్నాయి. మరి వాటిని ఎలా తొలగిస్తుందో చూడాలీ మరీ.

విడాకులు బాధాకరమే..కానీ

విడాకులు బాధాకరమే..కానీ

అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతమ్ గే అని.. సమస్యే లేదని కొట్టి పారేశారు.

English summary
actress samantha remove naga chaitanya photos in her instagram. recently they said break up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X