31వ తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్..? ఆన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడే కండక్ట్..
కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ గురించి ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏంటీ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇదివరకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ అనే వార్త వినిపించింది. కానీ అదీ కాస్త ముందుకు జరిగే అవకాశం ఉంది.

నిలకడగానే కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు నిలకడగా ఉండడం సానుకూల అంశంగా మారింది. విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవులు.. కానీ 3 రోజులు అదనంగా ఉన్నారు. 16వ తేదీ వరకు పండుగ సెలవులు ఇచ్చారు.
ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతోపాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

30వ తేదీతో ముగియనున్న సెలవులు
30వ తేదీతో ముగియనున్న సెలవులను పొడిగిస్తారా? లేక విద్యా సంస్థలను ప్రారంభిస్తారా? అన్న అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పాఠశాలలను తెరవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రెండేళ్ల నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నాయి.
వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం, ప్రస్తుత కరోనా వేరియంట్ అంత ప్రమాదకారి కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నాయి.

ఆన్యువల్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?
ఈ ఏడాది వార్షిక పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ సెట్లను నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే... ముందు ఈ ఏడాదికి సంబంధించిన విద్యా బోధన పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష తరగతులను తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని 31వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి తెరవడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందనే వాదన ఉంది.

అంతా డేంజర్
జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసరి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.