హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గూగుల్‌లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతో

|
Google Oneindia TeluguNews

సైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్‌తో నిందితుడు శ్రీనివాస్ స్వలింగ సంపర్కం కొనసాగించాడని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ ఫోన్‌కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపడితే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు.

ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?

ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య, అసలేం జరిగింది?ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య, అసలేం జరిగింది?

హైదరాబాద్ అమీర్‌పేట ధరమ్ కరమ్ రోడ్డులో సైంటిస్ట్ సురేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే అతను ఒంటిపై బట్టలు లేకుండా ఉండటం, సమీపంలో ఆయిల్ బాటిల్ లభించడంతో అతను గే అని పోలీసులు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శ్రీనివాస్ అనే వ్యక్తి 2 నెలలుగా ప్లాట్‌కి వచ్చి వెళ్తున్నట్టు గుర్తించారు. శ్రీనివాస్ అమీర్‌పేటలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.

Scientist suresh murder by his partner srinivas

సురేష్ భార్య చెన్నైలో పనిచేస్తున్నారు. 2005 నుంచి ఆమె అక్కడే ఉండటంతో నగరంలో సురేశ్ ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు. మరోవైపు భార్యభర్తల మధ్య చాలారోజుల నుంచి సంబంధాలు సరిగా లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో సురేశ్‌కు శ్రీనివాస్ దగ్గరయ్యాడు. వారిద్దరూ స్వలింగ సంపర్కం చేసుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. అయితే తనకు డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. అందుకు సురేష్ నిరాకరించడంతో.. హత్యకు దారితీసింది. సురేష్‌ను ఎలా చంపాలనే అంశంపై శ్రీనివాస్ గూగుల్‌లో కూడా సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన శ్రీనివాస్‌ను విచారించడంతో అసలు విషయం వెలుగుచూసిందని వెస్ట్ జోన్ డీసీపీ సుమతి పేర్కొన్నారు. సురేష్ భార్య ఫిర్యాదు ఆదారంగా శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని వివరించారు.

English summary
police reveal Scientist suresh murder case. suresh to be killed by his partner srinivas. this two persons are gay says police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X