తెలంగాణా సర్కార్ కు ఈసీ షాక్ ... ఎన్నికల కోడ్ అమల్లో ...తక్షణం వరద సాయం ఆపాలని ఆదేశం
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు పెద్ద షాక్ ఇచ్చింది . గ్రేటర్ హైదరాబాద్ లో వరదల కారణంగా నష్టపోయిన వారికి పదివేల రూపాయల వరద సాయాన్నిఅందిస్తున్న క్రమంలో వరద సాయాన్ని, వరద సాయం కోసం మీ సేవ కేంద్రాల నుండి దరఖాస్తులు తీసుకోవటాన్ని నిలిపివేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
గ్రేటర్ ఎన్నికల వేళ ... మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర .. కారణం ఇదే !!

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వరద సాయం ఆపెయ్యాలని ఈసీ ఆదేశం
గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వరద సహాయం అందిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఇస్తున్న వరద సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
గత రెండు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలు మీ సేవ కేంద్రాల ముందు వరద సహాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పడిగాపులు పడుతున్నారు.

మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ .. బ్రేక్ వేసిన ఈసీ
వరద సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే తరువాతి రోజున తమ ఖాతాల్లో నగదు జమ అవుతుంది అన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో మీ సేవ కేంద్రాల ముందు బారులు తీరారు. హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్ ,శేరిలింగంపల్లి , సికింద్రాబాద్ సీతాఫల్ మండి, సనత్ నగర్ , చందానగర్ , మారేడ్ పల్లి , కూకట్పల్లి , అంబర్ పేట గోల్నాక మీ సేవ కేంద్రాల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవడం కోసం పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణం దరఖాస్తులు తీసుకోవటం ఆపాలని , తక్షణం వరద సాయం ఆపేయాలని ఆదేశించింది ఈసీ .

ఎన్నికల తర్వాత వరద సాయం కొనసాగించుకోవచ్చని పేర్కొన్న ఎన్నికల కమీషన్
జిహెచ్ఎంసి ఎన్నికలు పూర్తయ్యే వరకు వరుస సాయాన్ని ఇవ్వకూడదని, ఎన్నికల తర్వాత యధావిధిగా వరద సహాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వరద సహాయానికి బ్రేక్ పడినట్లయింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన కొత్త కార్యక్రమాలు నిర్వహించకూడదు .

ఎలక్షన్ కోడ్ అమల్లో .. వెంటనే వరద సాయం ఆపాలని ఆర్డర్
గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ,వరదలకు వరద సహాయం అందని వారికి దరఖాస్తు చేసుకుంటే కొత్తగా వరద సహాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పడం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వం ఇలాంటి సహాయాలు అందిస్తే ఓటర్లను ప్రలోభ పెట్టి నట్లు అవుతుందని భావించి రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉన్నకారణంగా తక్షణం వరద సహాయాన్ని ఆపేయాలని ఆదేశించింది.
ఈసీ నిర్ణయం అటు ప్రభుత్వానికే కాదు ఇటు వరద సాయం కోసం ఆశగా ఎదురుచూసిన గ్రేటర్ వాసులకు షాక్ ఇచ్చింది.