హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవీంద్రభారతిపై వివాదం.. తెలంగాణవారికి కేటాయించడం లేదంటూ.. నిరసన

|
Google Oneindia TeluguNews

సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగినా...రవీంద్రభారతిలో తెలంగాణ కళలకు అవమానం జరగుతుందని ఆయన నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కళలకు సంబంధించిన కార్యక్రమాలకు రవీంద్రభారతిని ఇవ్వడం లేదంటూ ఆయన ఆయన నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే తమ కళలను ప్రదర్శించేందుకు రవీంద్రభారతిని ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారని , సుమారు తొమ్మిది నెలలుగా హాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

 Senior journalist Pasham Yadagiri has been arrested

ఈ నేపథ్యంలోనే గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం రవీంద్రభారతిలో పాల్గోన్న సభలో కూడ నిర్వాహకులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆరోపణలు చేశారు.ముఖ్యంగా ఇతర ప్రాంతానికి చెందిన కిన్నెర ఆర్ట్స్ సంస్థ ఆయన ఫోటో కూడ వాడడం లేదని అన్నారు. ప్రతిరోజు ఆంధ్రాప్రాంతానికి చెందిన వారి కార్యక్రమాలకే రవీంద్రభారతిని కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్థానిక కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

English summary
Senior journalist and Telangana activist Pasham Yadagiri has been arrested. He protested that Telangana arts would be neglected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X