హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు.. ఆరోజు ఏం జరిగిందో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

మౌనరాగం, మనసు మమత సీరియల్స్ తో ప్రజలకు దగ్గర అయిన శ్రావణి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు . సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసులోనిందితుల ద్వారా , ఆడియో , వీడియో ఫుటేజ్ ల ద్వారా కీలక సమాచారం సేకరించిన పోలీసులు ఈ కేసులో ప్రధానం గా దేవరాజ్ రెడ్డి , సాయి కృష్ణా రెడ్డి , ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిలను కోర్టు ముందు హాజరు పరచిన విషయం తెలిసిందే . కోర్టు వారికి రిమాండ్ విధించింది .

నటి శ్రావణి ట్రయాంగిల్ కథ..రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్,లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డినటి శ్రావణి ట్రయాంగిల్ కథ..రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్,లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి

మరోమారు నిందితులు దేవ్ రాజ్ రెడ్డి , సాయి కృష్ణా రెడ్డిల విచారణ

మరోమారు నిందితులు దేవ్ రాజ్ రెడ్డి , సాయి కృష్ణా రెడ్డిల విచారణ

తాజాగా ఈ కేసులో పోలీసులు మరింత సమాచారాన్ని నిందితుల నుండి రాబట్టటానికి వారిని కస్టడీ లోకి తీసుకున్నారు . మరోమారు నిందితులను విచారిస్తున్నారు. ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసులు శ్రావణి ఆత్మహత్య కేసులో సీనరీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది .శ్రావణి ఆత్మహత్యకు ముందు శ్రీ కన్య హోటల్ లో ఏం జరిగింది. శ్రావణి, సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్ రెడ్డి ల మధ్య ఎందుకు గొడవ జరిగింది? ఎలా జరిగింది? అసలు ఏమైంది అన్న కోణంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు.

కేసులో నేడు సీన్ రీ కన్ స్ట్రక్షన్

కేసులో నేడు సీన్ రీ కన్ స్ట్రక్షన్

ఆత్మహత్యకు ముందు ముగ్గురు సెల్ సిగ్నల్స్ ఆధారంగా వారు ముగ్గురు శ్రీ కన్య హోటల్ కు వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు ఈ కేసులో లభించిన వీడియోలు ,ఆడియోలు ఆధారంగా ఇద్దరు నిందితులను విచారించి , వారు ఇచ్చిన స్టేట్మెంట్ల మేరకు చార్జిషీట్ రూపొందించనున్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఈ కేసులో ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు.

శ్రావణి సూసైడ్ కేసులో ముగ్గురు అరెస్ట్ , రిమాండ్

శ్రావణి సూసైడ్ కేసులో ముగ్గురు అరెస్ట్ , రిమాండ్

మొదట సాయి కృష్ణా రెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని బుకాయించిన దేవ్ రాజ్ రెడ్డి ,ఆడియోలు, వీడియోలు లీక్ కావటంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు లొంగిపోయాడు . ఆ తర్వాత సాయి కృష్ణా రెడ్డి పాత్రపై విచారణ జరిపిన పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు అతను కూడా ఒక కారణంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు . ఇక వీరితో పాటు ఫోన్ రికార్డింగ్ ల ఆధారంగా ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు . కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది .

Recommended Video

School Fees: Actor Siva Balaji Complaint On Private Schools | Oneindia Telugu
సెప్టెంబర్ 7వ తేదీన ఆ హోటల్ లో ఏం జరిగింది ?

సెప్టెంబర్ 7వ తేదీన ఆ హోటల్ లో ఏం జరిగింది ?

ఈనెల 7వ తేదీన ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని శ్రీ కన్య హోటల్ లో శ్రావణి దేవరాజు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు.సీసీటీవీ ఫుటేజ్ లో దేవరాజ్ శ్రావణి సన్నిహితంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదే రోజు శ్రావణి, సాయి కృష్ణారెడ్డికి మధ్య ఘర్షణ జరిగినట్టు, శ్రావణి పై సాయికృష్ణా రెడ్డి చెయ్యి చేసుకున్నట్టు దేవరాజ్ పోలీసులతో చెప్పాడు. అయితే సాయి కృష్ణారెడ్డి శ్రావణిపై చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ? ఆరోజు శ్రావణి సూసైడ్ చేసుకోటానికి గల బలమైన కారణాలేంటి ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అసలు ఆ తర్వాత ఏం జరిగిందో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు

English summary
In the serial actress Shravani suicide case, the police took accused into custody to get more information . Today, it seems that the SR Nagar police are doing scene reconstruction in the Sravani suicide case. What happened at the Sri Kanya Hotel before Sravani committed suicide. Why the clash between Sravani, Sai Krishna Reddy and Devaraj Reddy? How did it happen? Police are going to reconstruct the scene in terms of what actually happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X