హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో డేంజర్ సెక్స్ మందుల తయారీ...? ఇతర రాష్ట్రాలకు సరఫరా..? ఇంకెమ్ ల్యాబ్ దారుణాలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ లో సెక్స్ డ్రగ్స్ ముఠా పట్టుబడటం దుమారం రేపింది. ఎక్కడో విదేశాల్లో కనిపించే అలాంటి డ్రగ్స్.. నగరంలో తయారవుతుండటం కలకలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదేళ్ల నుంచి ఈ దందా కొనసాగుతుండటం నగరవాసుల్ని విస్మయానికి గురిచేసింది. బెంగళూరులో పట్టుబడిన నేరస్థుడి సమాచారం మేరకు హైదరాబాద్ లో ఈ ముఠా గుట్టురట్టైంది.

బస్తీ దవాఖాన డాక్టర్ నిర్వాకం.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)బస్తీ దవాఖాన డాక్టర్ నిర్వాకం.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)

మత్తు.. సెక్స్ కోరికలు..! పైశాచికానందం

మత్తు.. సెక్స్ కోరికలు..! పైశాచికానందం

నాచారంలో సెక్స్ డ్రగ్స్ ముఠా వ్యవహారం వెలుగుచూసింది. ఇంకెమ్ అనే పేరుతో కెమికల్ ల్యాబ్ అంటూ నడుపుతున్న నిర్వాహకులు.. సెక్స్ డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తేలింది. కెటామిన్ అనే ఈ మత్తుమందు ఎవరికైనా ఇస్తే 5 గంటల పాటు మత్తులోకి వెళ్లిపోతారని చెబుతున్నారు నిపుణులు. అలా మత్తులోకి వెళ్లిపోవడమే కాదు.. సెక్స్ కోరికలు కూడా పెరుగుతాయట.

కొందరు నేరగాళ్లు ఈ డ్రగ్స్ ప్రయోగించి మహిళలను మత్తులోకి దించి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అయితే నగరంలో ఐదేళ్లుగా ఈ దందా యధేచ్ఛగా సాగుతున్నా.. పోలీసుల దృష్టికి రాకపోవడం గమనార్హం. సెక్స్ డ్రగ్స్ గా పిలిచే కెటామిన్ ను సాధారణంగా గుర్రాల్లో లైంగిక సామర్థం పెంచేందుకు వాడతారని తెలుస్తోంది.

కెటామిన్ గుట్టురట్టు

కెటామిన్ గుట్టురట్టు

గత నెల 30న బెంగళూరులోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో యూనిట్‌కు.. కెటామిన్ సరఫరాకు సంబంధించి పక్కా సమాచారం అందింది. దాంతో నిందితులను పట్టుకునే క్రమంలో అధికారులపైకి కారు ఎక్కించే ప్రయత్నం జరిగింది. అయితే సదరు కారు నెంబర్, వివిధ ఆధారాలతో చెన్నైకి చెందిన శివరాజ్ ను పట్టుకున్నారు. దర్యాప్తులో అతడు వెల్లడించిన వివరాలతో అధికారులు కంగుతిన్నారు.

బెంగళూరులో రెండు చోట్ల తనకు ఇళ్లు ఉన్నాయని చెప్పిన నిందితుడు.. కెంగేరి ప్రాంతంలోని ఇంట్లో కెటామిన్ తయారుచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దాంతో ఎన్సీబీ అధికారులు సదరు ఇంటిపై దాడి చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ డ్రగ్ తయారీ కోసం అక్కడ అత్యాధునిక లాబోరేటరీ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 25 కిలోలకు పైగా కెటామిన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

విదేశీ ముఠాలతో సంబంధాలు

విదేశీ ముఠాలతో సంబంధాలు

శివరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో కూడా కెటామిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కర్ణాటక ఎన్సీబీ అధికారులు ఏపీ, తెలంగాణ అధికారుల సాయంతో నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంకెమ్ లాబోరేటరీపై దాడి చేశారు. వెంకటేష్‌ అనే వ్యక్తి కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో ఐదేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు తేలింది. ఇక్కడి నుంచి కూడా కొంతమొత్తంలో కెటామిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు అధికారులు అదుపులోకి తీసుకున్న శివరాజ్ కు విదేశాల్లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. సెక్స్ డ్రగ్స్ పేరుతో కెటామిన్ మాదకద్రవ్యాన్ని గోవా, బెంగళూరు తదితర టూరిస్ట్ ప్రదేశాలకు తరలిస్తారని తేలింది. ఈ దందాతో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ తీసుకున్నవారు గానీ, ప్రయోగింపబడ్డవారు గానీ పైశాచిక ఆనందంతో మృగాళ్లాలా ప్రవర్తిస్తారనేది నిపుణుల మాట.

ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)

కెటామిన్ తయారీ డేంజరస్ ప్రాసెస్..!

కెటామిన్ తయారీ డేంజరస్ ప్రాసెస్..!

సైకోటోపిక్‌ మిశ్రమ పదార్థాల కేటగిరీలోకి వచ్చే కెటామిన్ తయారీకి కొన్ని రసాయనాలను వినియోగిస్తారు.చీకటి గదిలో మాత్రమే కెటామిన్ తయారుచేస్తారట. రసాయనాలను ప్రాసెసింగ్ చేసి కెటామిన్ ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా డేంజరని తెలుస్తోంది. ఈ సెక్స్ డ్రగ్స్ తయారీలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. భారీ విస్ఫోటనం జరిగే ఛాన్సుందట. అయితే నాచారంలో వెలుగుచూసిన ఇంకెమ్ ల్యాబ్ జనవాసాల్లో ఉండటం కలకలం రేపింది. మొత్తానికి అధికారులు సీజ్ చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

English summary
Sex Drug Ketamine Production Rocket busted in Bengaluru. The key role person of this gang shivaraj arrested by karnataka NCB officers. As per his information, the officers busted one more rocket in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X