హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ డ్రగ్స్ రాకెట్ కథ అంతేనా?.. హైదరాబాద్‌లో మూలాలు దొరికినా.. దర్యాప్తు ఏమైనట్లు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో సెక్స్ డ్రగ్స్ ముఠా పట్టుబడటం దుమారం రేపింది. ఎక్కడో విదేశాల్లో కనిపించే అలాంటి డ్రగ్స్.. నగరంలో తయారవుతుండటం కలకలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదేళ్ల నుంచి ఈ దందా కొనసాగుతుండటం నగరవాసుల్ని విస్మయానికి గురిచేసింది. బెంగళూరులో పట్టుబడిన నేరస్థుడి సమాచారం మేరకు గత నెలలో హైదరాబాద్‌లో ముఠా గుట్టురట్టైంది.

విదేశాల్లో దొరికే సెక్స్ డ్రగ్ హైదరాబాద్‌లో విరివిగా దొరుకుతోంది. కెటామిన్ తయారీ ముఠాలు కిలోలకొద్దీ అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే గుర్రాలకు లైంగిక సామర్థ్యం పెంచేందుకు వాడే సెక్స్ డ్రగ్స్ నగరంలో విచ్చలవిడిగా లభ్యమవుతుండటం సంచలనం రేకెత్తిస్తోంది. నాచారంలో ఓ గ్యాంగ్ పట్టుబడినా.. అలాంటి ముఠాలు ఇంకెన్ని ఉన్నాయనేదానిపై ఇన్వెస్టిగేషన్ లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భాగ్యనగరంలో సెక్స్ డ్రగ్స్.. అధికారుల నిఘా అంతంతమాత్రమేనా?

భాగ్యనగరంలో సెక్స్ డ్రగ్స్.. అధికారుల నిఘా అంతంతమాత్రమేనా?

హైదరాబాద్ మహానగరంలో సెక్స్ డ్రగ్స్ రాకెట్ లీలలు బయటపడ్డాయి. విదేశాల్లో తయారయ్యే సెక్స్ డ్రగ్స్ భాగ్యనగరంలో ఉత్పత్తి కావడం కలకలం రేపింది. కెటామిన్ పేరుతో పిలిచే ఆ మత్తుమందు ఎవరిమీదైనా ప్రయోగిస్తే 5 గంటల పాటు మత్తులోకి వెళ్లిపోతారట. అంతే కాదు.. సెక్స్ కోరికలు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతాయట. కొందరు నేరగాళ్లు ఈ డ్రగ్స్ ప్రయోగించి.. మహిళలను మత్తులోకి దించి అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్స్‌ను సాధారణంగా గుర్రాల్లో లైంగిక సామర్థం పెంచేందుకు వాడతారని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో సెక్స్ డ్రగ్స్ తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు కావడం చర్చానీయాంశమైంది. అయితే సంబంధిత అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నగరంలో కెటామిన్ తయారీకి సంబంధించి నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నా.. అలాంటి ముఠాలు ఇంకా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అత్త మీద అల్లుడి పగ.. పోర్న్ సైట్లలో ఆమె నెంబర్.. లైంగిక వేధింపులు తట్టుకోలేక..!అత్త మీద అల్లుడి పగ.. పోర్న్ సైట్లలో ఆమె నెంబర్.. లైంగిక వేధింపులు తట్టుకోలేక..!

నాచారంలో సెక్స్ డ్రగ్స్ తయారీ.. దర్యాప్తు ఏమైనట్లు..!

నాచారంలో సెక్స్ డ్రగ్స్ తయారీ.. దర్యాప్తు ఏమైనట్లు..!

గత నెల మొదటివారంలో బెంగళూరులో తొలుత ఈ సెక్స్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. అక్కడ పట్టుబడ్డ నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో కూడా దాడులు నిర్వహించారు సంబంధిత అధికారులు. దాంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కేంద్రంగా కెటామిన్ తయారీ జరుగుతుందనే విషయం బయటపడింది. ఇంకెమ్ అనే పేరుతో కెమికల్ ల్యాబ్ అంటూ నడుపుతున్న నిర్వాహకులు.. సెక్స్ డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తేలింది.

హైదరాబాద్‌లో ఇలాంటి డ్రగ్స్ తయారవుతోందనే విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అడ్డదారుల్లో విదేశాల నుంచి తెచ్చి అమ్ముతున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ, ఏకంగా ప్రొడక్షన్ సెంటర్ పెట్టారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

10 రోజుల వ్యవధిలో మరో ముఠా గుట్టురట్టు..! ఈసారి దూలపల్లి

10 రోజుల వ్యవధిలో మరో ముఠా గుట్టురట్టు..! ఈసారి దూలపల్లి

నాచారంలో ఇంకెమ్ కెమికల్ కంపెనీ పట్టుబడి పది రోజులు కాకముందే మరో ముఠా పోలీసుల వలకు చిక్కడం చర్చానీయాంశమైంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలోని దూలపల్లిలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం చర్చానీయాంశమైంది. ఓ మూతబడిన కంపెనీలో మత్తు పదార్థాలు తయారవుతున్నాయనే విషయం బయటపడటంతో స్థానికంగా కలకలం రేపింది.

డ్రగ్స్ తయారవుతున్నాయనే పక్కా సమాచారంతో సంబంధిత శాఖ అధికారులు దూలపల్లిలో దాడులు నిర్వహించారు. మత్తు పదార్థం భారీ స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రెండు ఘటనల తర్వాత నగరంలో ఇలాంటి ముఠాలు ఇంకా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

యూత్ టార్గెట్‌గా.. కోట్లల్లో వ్యాపారం..!

యూత్ టార్గెట్‌గా.. కోట్లల్లో వ్యాపారం..!

ఆధునిక కాలానికి తగ్గట్లుగా యువత ధోరణిలో మార్పు కనిపిస్తోంది. వేలు, లక్షల్లో జీతాలు అందుకుంటూ వీకెండ్స్ పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రమంలో యూత్ టార్గెట్‌గా డ్రగ్స్ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. వారిని క్రమంగా ముగ్గులోకి దింపుతూ కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. అడ్డదారుల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు.

వేలల్లో జీతాలు, పోష్ కల్చర్.. యువతను చెడుదారి పట్టిస్తున్నాయి. వారంలో ఐదు రోజులు పనిచేయడం, రెండు రోజులు విశ్రాంతి కోసం ఆరాటపడటం డ్రగ్స్ విక్రయదారులకు కాసుల పంట కురిపిస్తోంది. ఆ క్రమంలో పుట్టుకొచ్చిన రేవ్ పార్టీలు సెక్స్ డ్రగ్స్ అమ్మకాలకు నెలవుగా మారుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ద‌‌ృష్టి సారించి డ్రగ్స్ ముఠాల ఆట కట్టించాలని పలువురు కోరుతున్నారు.

English summary
Sex Drug Ketamine Caught In Huge Quantity In Hyderabad Last Month. Sex Drugs Gang made the Production In Nacharam Industrial Area and Officials rided and caught. But there is no further investigation that how many sex drugs rockets working at the base of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X