హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచారమే ఉద్యోగం .. 25 వేల జీతం ,భోజనం,వసతి ఇచ్చి మరీ వ్యభిచారం చేయిస్తున్న ముఠా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. వీళ్ళు, వాళ్ళు అన్న తేడా లేకుండా యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకుని ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు . అవసరాల్లో ఉన్న యువతులకు ఎరవేసి జీతం , భోజనం, వసతి కల్పించి మరీ వారితో వ్యభిచారం చేయించటం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అమీర్ పేటలో అశ్లీల దందా.. హోటల్ అడ్డాగా వ్యభిచారం .. గుట్టు రట్టు చేసిన పోలీసులుఅమీర్ పేటలో అశ్లీల దందా.. హోటల్ అడ్డాగా వ్యభిచారం .. గుట్టు రట్టు చేసిన పోలీసులు

 ఇళ్ళలో కూడా వ్యభిచార దందా

ఇళ్ళలో కూడా వ్యభిచార దందా

రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలనీలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం దందాను పోలీసులు రట్టు చేశారు పోలీసులు . ఈమేరకు ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నగరానికి చెందిన సాయి మరికొందరితో కలిసి ఉప్పర్‌పల్లి సన్‌రైజ్‌ కాలనీలో మూడు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని 15 రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

 వ్యభిచారం చేస్తే ..నెలకు 25వేల జీతం , భోజనం, వసతి

వ్యభిచారం చేస్తే ..నెలకు 25వేల జీతం , భోజనం, వసతి

ఇక వీరు ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి యువతులను తీసుకువచ్చి నెలకు 25 వేల జీతం, భోజనం, వసతి కల్పిస్తామని చెప్పి వారి చేత వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవసరంలో ఉన్న యువతులను ట్రాప్ చేసి మరీ వీరు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. చార్మినార్ ప్రాంతానికి చెందినఇమ్రాన్ ఖాన్ వీరికి విటులను పంపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, నిర్వాహకులు అరెస్ట్

ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, నిర్వాహకులు అరెస్ట్

ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు ఉప్పర్‌పల్లిలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, మరో ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు, రూ. 28 వేల నగదు, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచార ముఠాను సాయి.. దినేష్‌సింగ్, మణిశర్మతో కలిసి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమేరకు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు.

రోజుకో కొత్త పద్దతిలో సాగుతున్న వ్యభిచార దందా

రోజుకో కొత్త పద్దతిలో సాగుతున్న వ్యభిచార దందా

ఇక ఈ దాడిలో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులు, విటులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పంపినట్లు వెల్లడించారు. ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేకుండా హోటళ్ళు, లాడ్జీలు, స్పాలు, చివరకు ఇళ్ళ మధ్యలో కూడా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగుతుంది. పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసినా ఈ దందాకు మాత్రం చెక్ పడటం లేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు రోజుకో కొత్త విధానంలో ఈ హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నారు.

English summary
The Rajendranagar police along with the Special Operations Team police busted a sex racket and arrested seven persons at Upparpally on Sunday night. Six women were rescued from flesh trade. The arrested persons were Manish, Deepak, Imran, Krishna, Sudhakar, Jagannath and Tukkaram. Police said the rescued women, who were kept in a triple-bedroom flat in an apartment in a residential colony, hailed from Mumbai, Delhi and Hyderabad and were lured into flesh trade. While the women were sent to rescue home, the arrested men were produced before the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X