హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ పోలీస్.. కొన్ని చోట్ల కఠినం..!మరి కొన్ని చోట్ల కారుణ్యం..!లాక్ డౌన్ అమలులో పోలీసుల పాత్ర సూపర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: దేశం విషమ పరిస్థితుల్లో ఉంది. క్లిష్టిమైన సమస్యను అధిగమించే అంశాన్ని దేశ ప్రజలు సవాల్ గా తీసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ లక్ష్మణ రేఖకు కంకణబద్దులుగా మారిపోయారు. దేశ పౌరులందరూ స్వీయ నియంత్రణ పాటించి దేశంలో చెలరేగిని విపత్కర పరిస్ధితుల నుండి ఉపశమనం పొందే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి పొంచి ఉన్న ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా పోలీసు వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

 కరోనా కట్టడిలో పోలీసుల కర్తవ్యం..

కరోనా కట్టడిలో పోలీసుల కర్తవ్యం..

గత కొన్ని సంవత్సరాలుగా స్నేహపూర్వక పోలీసు వ్యవస్థ పేరుతో పోలీసులు ప్రజలతో సానుకూలంగా వ్యవహరించారు. వివాదాల పేరుతో పోలీసు స్టేషన్ కు వెళ్లిన వారి పట్ల కూడా సౌమ్యంగా వ్యవహరించి ఇరు పక్షాలకు సర్ధిచెప్పి శాంతియుత వాతావారణాన్ని నెలకొల్పడంలో వినూత్న అడుగులు వేసారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రజలకు మధ్య ఓ సున్నితమైన అనుబంధం కూడా ఏర్పడింది. పోలీసు స్టేషన్ కు వెళ్లాలంటే గజగజలాడిపోయే ప్రజలు నిర్బయంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వినిపించి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేసే పరిస్థితులు తలెత్తాయి.

కరోనా ముందువరకూ స్నేహపూర్వక పోలీస్..

కరోనా ముందువరకూ స్నేహపూర్వక పోలీస్..

అంతవరకూ పరిస్ధితులు ఎంతో స్నేహపూర్వకంగా మారి పోలీసుల పట్ల సానుకూల దృక్పదం ఏర్పడిన తరుణంలో పోలీసులు ఊహించని రీతిలో లాఠీలకు పట్టిన బూజును దులిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని దేశ ప్రధాని పిలుపునివ్వడంతో అందరూ సానుకూలంగా స్పందించారు. ఎవ్వరూ కూడా ప్రభుత్వ అదేశాలను దిక్కరించకూండా కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సిద్దమయ్మారు. ఇదే క్రమంలో కొంత మంది తమ ఛాదస్ధాన్ని కూడా చాటుకున్నారు. స్వీయ నియంత్రణ నిభంధనలను బేఖాతరు చేస్తూ అకారణంగా రోడ్ల పైన తిరిగేందుకు సమాయత్తం అయ్యారు. అలాంటి వారి పట్ల పోలీసులు మరొక్క సారి లాఠీ ఝుళిపించారు.

మరో 12రోజులు..

మరో 12రోజులు..

కాగా 21రోజుల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పలు సందర్బాల్లో వివరించాయి. ఇవే నిబంధనలు అందరూ పాటించాలని అనేక సార్లు విజ్ఞప్తులు కూడా చేసింది కేంద్రం. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పలు ముందు జాగ్రత్త చర్యలను సూచించాయి. ప్రజలెవ్వరూ సమూహాలుగా ఏర్పడకూడదని, బాహ్యప్రపంచాన్ని 21రోజులు మర్చిపోయి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు పలు సందర్బాల్లో వివరించాయి. కాడా చిన్న చిన్న కారణాలతో కొందరూ, ఏకారణం లేకుండా మరి కొందరు రోడ్ల పైకి వచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు నిలువరించే క్రమంలో పోలీసులు ఎంతో సంయమనాన్ని ప్రదర్శించారు.

Recommended Video

132 Positive Cases In AP, 127 In TS | Total Positive Cases in India
 నిబధనలను దిక్కరించిన వారిపై మాత్రమే కొరడా..

నిబధనలను దిక్కరించిన వారిపై మాత్రమే కొరడా..

లాక్ డౌన్ నిభంధనలను ఉల్లంఘించిన వారిపట్ల పోలీసులు మొదట ఉదాసీనంగా వ్యవహరించారు. విజ్ఞప్తులు చేసారు, దండం పెట్టారు, బ్రతిమిలాడారు. అయినప్పటికి వారిలో మార్పు రాకపోయే సరికి లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. నిభంధనలకు విరుద్దంగా క్రికెట్ అడుతున్న వారిని, పేకాడుతున్న వారిని, బహిరంగ ప్రదేశాల్లో కల్లు తాగుతున్న వారిని, కాలక్షేపానికి మాస్కులు ధరించకుండా రోడ్ల మీద విహరిస్తున్న వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరాంచారు పోలీసులు. ఇదే పరంపరలో కొంత మంది నిమిత్తమాత్రులపైన కూడా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారనే అపవాదును మూటకట్టుకున్నారు. ఇదే క్రమంలో కొంత మంది పోలీసులపైన వేటు కూడా పడింది. ఏపిలోని పలాసలో తండ్రీకొడులకులను విచక్షణారహితంగా కొట్టడం, కరీంనగర్ లో మహిళపై దాడి, పనపర్తిలో షాప్ యజమానిని కుమారుడి ముందే కొట్టడం వంటి చర్యలు మినహాయిస్తే కరోనా కట్టడిలో పోలసుల భాగస్వామ్యం శభాష్ అనే చర్చ జరుగుతోంది.

English summary
Some have even made their mark. They seemingly get ready to get back on the road, disregarding the self-regulation regulations. Once again, the police was fired at them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X