• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెట్టింట్లో రచ్చ.. అచ్చు ఆయనలాగే ఉన్నా.. ఇతనే మరి..!

|

హైదరాబాద్ : ఫేస్ యాప్స్‌తో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ ముఖకవలికలు ఎట్లుంటున్నాయో చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అదే క్రమంలో రాజకీయనేతలు, సెలబ్రిటీల ఫోటోలతో ఫేస్ లుక్కులు మార్చేస్తున్నారు. ఫలానా లీడర్ 60 ఏళ్లల్లో ఎలా ఉంటారు. మరి ఇంకో నేత ఇతర రూపంలో బాగుంటారా.. ఇలాంటి అనుమానాలతో ఫేస్ యాప్స్ వాడేస్తున్నారు. దాంతో సదరు లీడర్ల ఫోటోలు అందులో అప్‌లోడ్ చేసి కొత్తగా దర్శనమిచ్చే ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు.

నయా షేక్‌స్పియర్‌.. ఎవరంటే..!

నయా షేక్‌స్పియర్‌.. ఎవరంటే..!

తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఫోటోను ప్రసిద్ధ ఇంగ్లీష్‌ నాటక రచయిత షేక్‌స్పియర్‌లా మార్చేశారు. ఎవరో తెలియని వ్యక్తి దాన్ని క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏకంగా శశిథరూర్ వాట్సాప్ నంబరుకు చేరింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శశిథరూర్.. ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నేను చాలా గొప్ప చిత్రం చూశాను. నన్ను షేక్‌స్పియర్‌లా మార్చాలని చూశారు. అసలు ఆయనతో నన్ను పోల్చడానికి అర్హుడను కాను. అయినప్పటికీ నా ఫోటోను ఇలా తయారుచేసిన వారికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.

సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!

నెట్టింట రచ్చ

నెట్టింట రచ్చ

శశిథరూర్ ట్వీట్ చేయనంతవరకు దీన్ని చాలామటుకు సరాదాగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారో అసలు కథ ఆరంభమైంది. భిన్నవాదనలకు తెర లేపింది. శశిథరూర్ అంటే గిట్టని వారు.. ఆయనంటే పడనివారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నువ్వేమైనా మీసాలు లేని షేక్‌స్పియర్ అనుకుంటున్నావా.. అంతలేదుగా.. నువ్వు షేక్‌స్పియరుద్దీన్ అంటూ ఎద్దేవా చేశాడు. అదలావుంటే మరికొందరేమో ఆయనకు వత్తాసు పలుకుతూ చాలా బాగుంది ఫోటో అని కితాబిస్తున్నారు. ఆ క్రమంలో మీరు గొప్ప రచయిత, రాజకీయవేత్త అంటూ పొగిడేశాడు ఓ నెటిజన్.

 కేటీఆర్ ఫోటో కూడా వైరల్

కేటీఆర్ ఫోటో కూడా వైరల్

ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఫోటో కూడా ఇలాగే వైరల్ అయింది. అందాల తారకరాముడు అరవై ఏళ్ల వయసులో ఎలా ఉంటారో తెలుసా అంటూ ఓ అభిమాని సరికొత్తగా ఫోటో క్రియేట్ చేశాడు. 60 ఏళ్ల వయసులోనూ..! అందగాడే మా అన్న అంటూ..! మొన్నటివరకు సోషల్ మీడియాలో ఆ ఫోటో బాగా వైరల్ అయింది. యంగ్ ఏజ్‌లో ఎంత అందంగా కనపడుతున్నారో.. ఆ వయసులోనూ ఆయన అందానికి వచ్చిన ఢోకా ఏమి లేనట్లుగా ఉంది ఆ ఫోటో. ఆయన ఫ్యాన్స్.. అన్న ఎప్పుడూ అందగాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు సింహం ఎప్పుడైనా సింహమే అంటూ మరికొందరు కామెంటుతున్నారు. మొహం మీద కాస్తా ముడతలు తప్ప ఇప్పుడు అప్పుడు ఆయన సేమ్ ఉంటారనే కామెంట్లకు కూడా కొదవ లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Young people are choking with face apps. The tribe is dying to see their facial expressions. In the same order, photos of politicians and celebrities are being exchanged for Funny. How the Fallen Leader is in 60 years. Another leader is good in some other form.. like that. The latest congress Leader Shashi Tharoor's photo has been changed to a well-known English playwright Shakespeare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more