హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్.. కోర్టు నుంచి రిమాండ్‌కు.. మరో నలుగురిపై కేసు

|
Google Oneindia TeluguNews

నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నామనే అంశంపై గోప్యత పాటించారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌తోపాటు మరో నలుగురిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రమాదానికి సంబంధించి వైద్యశాఖ అధికారులు పూర్తి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది

ఈ నెల 21న షైన్ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో పొగలు వ్యాపించాయి. అక్కడ ఐదారుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పొగతో ఊపిరాడక నాలుగు నెలల చిన్నారి మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు హుటహుటిన తనిఖీలు చేపట్టారు. వైద్యాధికారులు నివేదిక రూపొందించి ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని తేల్చినట్టు సమాచారం. షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం సునీల్‌ను రిమాండ్‌లోకి తీసుకొని విచారిస్తున్నారు.

shine hospital md sunil arrested

షైన్ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇదివరకు కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఉన్న ఆస్పత్రులపై దృష్టిసారించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని 350 ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీచేశారు.

English summary
shine hospital md sunil kumar arrested. police take remand to sunil kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X