సహజీవనం చేసి మోజు తీరాక.. మరొకరితో పెళ్లి చేసుకొని, ఫిర్యాదుతో..
ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నిత్యం వార్తలు వస్తోన్న.. అమాయక అమ్మాయిలు కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువతి వంచనకు గురయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని.. అతనికి కఠినంగా శిక్షించాలని కోరారు.

ప్రేమ పేరుతో మోసం..
ఉదయ్ నగర్‌కి చెందిన యువతి చిరు వ్యాపారం చేసేంది. అయితే రెండేళ్ల క్రితం దుబాయ్‌లో ఉద్యోగం చేసే శివశంకర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు వచ్చే ఆయనతో ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి. గతేడాది మే నెలలో పెళ్లి చేయాలని అనుకొన్నారు. యువతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో.. పెళ్లిని ఈ ఏడాది మార్చికి వాయిదా వేశారు. ఇందుకు యువకుడు శివశంకర్ కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి..
అంతా బాగానే ఉంది. ఈ ఏడాది జనవరిలో శివశంకర్ యువతిని దుబాయ్ రావాలని కోరగా.. ఆమె వెళ్లింది. అక్కడిక వెళ్లకా.. తాను మోసపోయానని యువతి గ్రహించింది. శివశంకర్ పనిచేసే కార్యాలయానికి యువతి వెళ్లగా.. కోలిగ్స్ అతను భారత్ వెళ్లిపోయాడని తెలిపారు. అంతేకాదు శివశంకర్ మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఆమె విస్తుపోయింది. తనకు అన్యాయం జరిగిందని వాపోయింది.

దుబాయ్ వెళితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది...
తనతో సహజీవనం చేసి.. పెళ్లి చేసుకోకుండా శివశంకర్ మోసం చాటేశాడని నిట్టూర్చింది. బంజరాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా.. అమాయక యువతులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. ప్రేమ పెళ్లి పేరుతో వంచనకు గురవుతున్నారు. ఆ జాబితాలో మరో యువతి చేరింది.