హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీఆర్వోకు లంచం సెగ....!! విజయారెడ్డిపై దాడికి నిరసన చేపట్టిన రెవెన్యు ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

VRO Blamed For Bribe,Video Goes Viral || నా డబ్బులు నాకియ్యి..నీ కాలర్ పట్టుకుంటా !

తహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్ది భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం వద్ద మండల వీర్వోలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన ఓ భూ యజమాని నిరసనలో కూర్చున్న వీఆర్వోపై విరుచుకుపడింది. గత సంవత్సరంన్నరగా తమకు చెందిన పట్టాదారు పాసు పుస్తకం కోసం చెప్పులు అరిగేలా తిరుగున్నా వారికి పాస్‌బుక్‌ ఇవ్వడం లేదని నిలదీసింది.

విజయారెడ్డి సజీవదహనం: సురేష్ కాకుండా.. ఇంకా చాలా మంది హస్తం.. భర్త 'సీబీఐ’ డిమాండ్విజయారెడ్డి సజీవదహనం: సురేష్ కాకుండా.. ఇంకా చాలా మంది హస్తం.. భర్త 'సీబీఐ’ డిమాండ్

నిరసన కార్యక్రమంలోనే వీఆర్వో నిలదీత

దీంతోపాటు పట్టా పాస్‌బుక్ ఇప్పిస్తానని తన వద్ద లంచం తీసుకున్నాడని ఆరోపించింది. తిరిగి వాటిని ఇవ్వాలని అడిగింది. లేదంటే గల్లాపట్టి తీసుకుంటానని చెప్పింది. దీంతో అక్కడ కూర్చున్న వీఆర్వోలు ఎవ్వరు కూడ వ్యతిరేకించిన పరిస్తితి కనిపించలేదు. అయితే ఆమె పక్కన భర్త పక్కకు తీసుకెళ్లి సముదాయించాడు. అయితే అక్కడ ఉన్న ఇతర రైతులు సైతం వీఆర్వోను నిలదీస్తున్న రైతుకు మద్దతు పలికారు. ఈనేపథ్యంలోనే ఆమెను పక్కకు తీసుకెళ్తున్న భర్తను వారించారు.

 విజయారెడ్డిపై దాడికి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

విజయారెడ్డిపై దాడికి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు విజయరెడ్డి సజీవదహనంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తహాసీల్దార్‌‌పై పెట్రోలు పోసి దారుణంగా నిప్పంటించడంపై ఓవైపు ఉద్యోగసంఘాలు, ఇతర రాజకీయా నాయకులు మండిపడుతున్నారు. నిందితుడు సురేష్ తోపాటు ఇందుకు ప్రోత్సహించిన ప్రతిఒక్కరిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో దాడికి నిరసగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల నుండి వ్యతిరేకత

ప్రజల నుండి వ్యతిరేకత

అయితే ఇదే సంధర్భంలో రెవెన్యు తీరుపై కూడ సామాన్య ప్రజల నుండి పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించేందుక అధికారులు సంవత్సరాల తరబడి వారిని కార్యాలయాల చుట్టు తిప్పడంపై కూడ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తహాసీల్దారుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్న ప్రజలు సురేశ్ లాంటీ వారు ఎంతోమంది రెవెన్యు ఉద్యోగుల తప్పిదాల వల్ల మనోవేదనకు గురైన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుండాల మండలంలో నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్వోకు లంచం సెగ తగలడం లాంటీ సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు.

English summary
a shocked incident was happened at gundala mandal a woman has attacked asking money the vro who protesting for the tahasildar vijaya reddy murder incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X