రూ.40 లక్షలు బిల్.. స్టార్ హోటల్లో రాజసం, లగ్జరీ కార్లు.. ఇదీ కిలేడీ కహానీ
కిలేడీ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పెళ్లి సంబంధం కుదుర్చుతామని వ్యాపారి వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టడంతో కిలేడీ శిరీష అలియాస్ సృతి సింహా లీలలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేసు విచారణ క్రమంలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీ కోసం డబ్బున్న వారిని తమ ఎరలో వేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన శిరీషకు విజయ్ తోడయ్యాడు. ఇంకేముంది వారిద్దరూ పేర్లు మార్చి, లేని స్టేటస్ ప్రదర్శించి మరీ మోసం చేశారు.

11.5 కోట్లు వసూల్..
విజయ్ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తగా.. శిరీష అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్‌గా బిల్డప్ ఇచ్చిందిజ ఈజీ మనీ కోసం వ్యాపారులను బురిడీ కొట్టించడమే పనిగా పెట్టుకున్నారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన వీరారెడ్డి పరిచయం అయ్యాడు. పెళ్లి సంబంధం పేరుతో 11.5 కోట్లు వసూల్ చేశారు. తీరా డబ్బు అడిగితే ఇవ్వకపోవడంతో.. అతను పోలీసులను ఆశ్రయించారు. తీగ లాగితే డొంక కదిలింది. అయితే వారు విలాసవంతమైన జీవితం గడిపారు. స్టార్ హోటల్లో ఎంజాయ్ చేశారు. వీరారెడ్డి నుంచి తీసుకున్న రూ.11.5 కోట్లతో రాయల్ లైఫ్ గడిపారు. వారి రాజసం చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.

లగ్జరీ కార్లు కొనుగోలు
డబ్బులు కొల్లగొట్టిన తర్వాత విలాసవంతంగా ఉన్నారు. శంషాబాద్ వద్ద ఓ హోటల్లో బస చేశారు. రోజుకు రూ.లక్ష ఇచ్చి ఖరీదైన సూట్ తీసుకున్నారు. 40 రోజులు అక్కడే ఉండి రూ.40 లక్షలు బిల్ చెల్లించారు. వీరారెడ్డికి పరిచయం అయ్యేనాటికి వీరిద్దరూ కిలాడీలు డబ్బు సంపాదించారు. 1.8 కోట్లతో బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. ఆ ఫోటో చూపించి.. వీరారెడ్డి వద్ద బిల్డప్ ఇచ్చారు తర్వాత రూ.1.7 కోట్లతో మరో కారు కొనుగోలు చేశారు. రూ.70 లక్షలతో మరో కారును కొన్నారని పోలీసులు తెలిపారు. పటాన్ చెరులో రూ.1.5 కోట్లతో విలాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.70 లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించారు.

డబ్బులు అడిగితే ఇచ్చేవారు..
కష్టపడి సంపాదించిన డబ్బు కాదు.. అందుకే రాయల్‌గా తిరగడం ప్రారంభించారు. బంధువులు డబ్బులు అడిగితే ఇచ్చేవారు. తక్కువ నగదు అయితే అడిగేవారు కాదు.. దీంతో వారికి అనుమానం వచ్చి అడిగారు. విషయం తెలిసి.. వారితో కొందరు చేతులు కూడా కలిపారు. శిరీష లైఫ్ చూసి వీరారెడ్డికి నమ్మకం కలిగింది. తమ చెల్లిని ఇస్తానని చెప్పి.. వేరే ఫోటోలను చూపించింది. పెళ్లి విషయం సెట్ అయ్యాక.. రకరకాల కారణాలు చెప్పి నగదు వసూల్ చేశారు. డబ్బు గురించి అడిగితే కథలు చెప్పేవారు. దీంతో అనుమానం వచ్చి.. వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ క్రమంలో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.