హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్ .. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తాజాగా సిట్ అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. నయీం కేసులో నయీంతో సంబంధాలు ఉన్న, అతనితో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న పోలీసుల విషయంలో దర్యాప్తు గురించి, నయీం కేసులో పోలీస్ అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సిట్ చీఫ్ నాగిరెడ్డికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.

 నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్ చిట్

నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్ చిట్


దీనికి సమాధానం ఇచ్చిన సిట్ చీఫ్ నాగిరెడ్డి 25 మంది పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గా పేర్కొన్నారు.

నయీం కేసులో 25 మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు ఉన్నట్టు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పలువురు పోలీసు అధికారులు నయీమ్ చేసే భూకబ్జాలకు సహకరించే వారిని, ల్యాండ్ సెటిల్మెంట్లు చూసే వారని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

సాఖ్యాలు లభించని కారణంగా క్లీన్ చిట్ ఇచ్చిన సిట్

సాఖ్యాలు లభించని కారణంగా క్లీన్ చిట్ ఇచ్చిన సిట్


అయితే ఈ కేసులో 25 మంది పోలీసు లకు సంబంధించి, నయీం తో సంబంధం ఉన్నట్లుగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలు లభించకపోవడంతో సిట్ అధికారులు 25 మంది పోలీసు అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.

ఇప్పటివరకు గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో 175 కి పైగా సిట్ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లు, ఇద్దరు అడిషనల్ ఎస్పీ లతోపాటు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐ లతోపాటు కానిస్టేబుల్స్ వరకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

నయీం కేసు నుండి బయట పడిన పోలీసులు వీరే

నయీం కేసు నుండి బయట పడిన పోలీసులు వీరే


క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు వివరాలు చూస్తే వీరిలో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్ లు ఉన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు సిహెచ్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాష్ రావు, వెంకట నరసయ్య, అమరేందర్ రెడ్డి , తిరుపతన్నలు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన జాబితాలో ఉన్నారు. అదేవిధంగా సిఐలు మస్తాన్, శ్రీనివాస్ నాయుడు, రాజగోపాల్, వెంకటయ్య, కిషన్, ఎన్ శ్రీనివాస్ రావు ,వెంకటరెడ్డి ,మజీద్, వెంకట సూర్యనారాయణ ,బలవంతయ్య, రవి కిరణ్ రెడ్డి, నరేందర్ గౌడ్, రవీందర్ ల పేర్లు క్లీన్ చిట్ ఇచ్చిన జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా కానిస్టేబుళ్లు దినేష్ ఆనంద్ , బాలన్న , సదాత్ మియా లకు కూడా సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది .

Recommended Video

India Vs Bangladesh,Day-Night Test : Team India Physio Treats Bangladesh Batsman || Oneindia Telugu
 నయీం కేసుపై లోక్ పాల్ కు ఫిర్యాదు .. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు సమాధానంగా సిట్ చీఫ్

నయీం కేసుపై లోక్ పాల్ కు ఫిర్యాదు .. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు సమాధానంగా సిట్ చీఫ్

అయితే నయీం కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలోనే లోక్ పాల్ కు లేఖ రాసింది ఆర్.టి.ఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని,నయీం తో పోలీసులు,రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలను,అంతేకాకుండా వీడియోసాక్ష్యాలను కూడా లోక్ పాల్ కు సమర్పించి ఈ కేసును విచారించాలని కోరింది. నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు,రాజకీయ నేతల ప్రమేయం ఉన్నదని,నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆసక్తికరమైన అంశాలను తన లేఖలో పేర్కొంది. తాజాగా నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వటం ఆసక్తికర పరిణామం .

English summary
SIT gave clean chit to 25 police officers in gangster Nayeem case. It is learned that 25 policemen have been accused of having links with the gangster Nayeem but no evidence for the links . so, SIT gave clean chit to the police . forum for better governance wrote a letter regarding this and the SIT chief nagi reddy replied .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X