హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాప్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్.. చదువుకొని కూడా.. ఈ పనా..

|
Google Oneindia TeluguNews

జూదం.. మార్పులు చెందుతోంది. ఒకప్పుడు కార్డ్స్, గవ్వలు ఆడేవారు. ఇప్పుడు కూడా ఆడుతోన్నా.. కరోనా వల్ల అదీ ఆన్ లైన్ అయ్యింది. ఇదివరకు కూడా ఆన్ లైన్ ఉన్నా.. ఇప్పుడు ఆన్ లైన్ ఆటలు/ బెట్టింగులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో చాలా మంది లక్షలకు లక్షలు లాస్ అవుతున్నారు. అయితే వీరిలో చదువుకొని జాబ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు.

పటాన్ చెరు చైతన్య నగర్ కాలనీకి చెందిన రవికుమార్ సాప్ట్ వేర్ ఇంజినీర్. బెంగళూరు ఇన్పోసిస్‌లో జాబ్ చేస్తున్నాడు. అయితే కరోనా వల్ల వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే ఆన్ లైన్ బెట్టింగులు చేసి.. అప్పుల పాలయ్యాడు. తన జీతం, కూడబెట్టినా నగదు కూడా సరిపోలేదు. తండ్రికి చెప్పడంతో రూ.లక్ష వరకు అప్పు కట్టేశాడు. అయినా అప్పు తీరలేదు. ఇంకెముంది.. మనస్తాపానికి గురయ్యాడు.

software engineer suicide at patancheru

చేసిన అప్పు తీరడం లేదు. తండ్రి ఇచ్చిన డబ్బులు కూడా సరిపోలేదు. మంగళవారం తండ్రి జాబ్‌కి వెళ్లగానే తన గదిలో ఉరేసుకున్నాడు. గమనించిన తల్లి పక్కింటి వారిని పిలిచి.. డోర్ పగులగొట్టింది. అయినా లాభం లేకపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు.

ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న రవికుమార్ అస్తమించాడు. దీనిని అతని పేరంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమలా మరే తల్లిదండ్రులు ఇలాంటి బాధ భరించొద్దు అని చెబుతున్నారు. బెట్టింగుల పేరుతో జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచిస్తున్నారు.

English summary
software engineer suicide at patancheru due to online betting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X