హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్, నడుస్తోన్న కొన్ని విద్యాసంస్థలు, కేటీఆర్‌కు ట్వీట్, చర్యలు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. మార్చి 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయినా కొన్ని స్కూళ్లు, కాలేజీలు మాత్రమే ఎప్పటిలాగే నడుస్తోన్నాయి. దీంతో ఓ పేరంట్ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. సంబంధిత స్కూళ్లు/కాలేజీలపై చర్యలు తప్పవని ఇండికేషన్స్ ఇచ్చారు.

15 రోజులు సకలం బంద్..

15 రోజులు సకలం బంద్..

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో స్కూళ్లు/కాలేజీలు సహా జనం కూడా గుమికూడొద్దని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టంచేశారు. 15 రోజులు ఏ స్కూల్, కాలేజీ తెరిచిన కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదేశించినా.. కొన్ని విద్యాసంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. యథేచ్చగా స్కూళ్లు, కాలేజీలను నడిపిస్తున్నాయి. ఈ మేరకు అనన్య చౌదరి అనే ట్విట్టర్ యూజర్ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని విద్యాసంస్థలు నిబంధనలకు పాతర వేస్తున్నాయని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

చర్యలు తప్పవు..

చర్యలు తప్పవు..

ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామని పేర్కొన్నారు. కానీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం ర్యాంకుల కోసం తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. పిల్లల ఆరోగ్యం కన్నా వారికి ర్యాంకులే ముఖ్యమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది.

లైసెన్స్/పర్మిషన్ రద్దు..?

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించని విద్యాసంస్థలు/ఇతర సంస్థలపై చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టంచేశారు. తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని తేల్చిచెప్పారు. అయినా కొందరు ధిక్కరించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారి డేటా తీసి.. విద్యాసంస్థల లైసెన్స్ కూడా రద్దుచేసే అవకాశం ఉంది. మిగతా సంస్థలకు సంబంధించి పర్మిషన్ రద్దు చేస్తామని కూడా ప్రభుత్వవర్గాలు తేల్చిచెప్పాయి. ఏప్రిల్ మొదటివారంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి డేటా తీసి.. ఒక్కొ సంస్థపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.

English summary
some educational institutes are working in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X