హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల సిత్రాలు.. అక్కడ 10/- కే ఫుల్ బాటిల్.. చౌకబేరం రివర్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలతో ఆయా పార్టీల అభ్యర్థులు కొత్త దారులు వెతుక్కున్నారు. డిజిటల్ చెల్లింపులతో రోజువారి ఖర్చులు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. ఇలా ఎన్నోరకాలుగా లొసుగులేంటో పట్టేశారు. ఇక ప్రచారం ముగియడంతో లిక్కర్ పంపిణీకి తెర తీశారు కొందరు. అయితే ఒకచోట "మందు పంపిణీ సిత్రాలు" ఔరా అనిపిస్తున్నాయి.

ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతోంది. పలుచోట్ల లీటర్ల కొద్దీ మద్యం పట్టుబడుతోంది. ఈనేపథ్యంలో తాము చిక్కకుండా కొందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లిక్కర్ నేరుగా పంపిణీ చేయకుండా అడ్డదారులు వెతుక్కుంటున్నారు.

లిక్కర్ కిక్కులో నయా రూట్

లిక్కర్ కిక్కులో నయా రూట్

ఒక ఫుల్ బాటిల్ కావాలంటే తక్కువలో తక్కువ 400-500 రూపాయలు ఉంటుంది కదా. కానీ ఒకాయన 10 రూపాయల నోటిస్తే ఫుల్ బాటిల్ ఇచ్చేశారంట. ఇదేంటి ధరలు తగ్గాయా? లేదంటే డిస్కౌంట్లు ఇస్తున్నారా అని అనుకోకండి. అది ఎన్నికల సిత్రమంట. ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుందనే విషయం బహిరంగ రహస్యం. అయితే కొందరు నేతలు మద్యం పంపిణీకి కొత్త బాటలు వేశారట.

నాట్ చీప్ లిక్కర్..

నాట్ చీప్ లిక్కర్.. "చీఫ్ ఐడియా"

లిక్కర్ బాటిళ్లు తాము పంచాలంటే పెద్ద గందరగోళం.. దానికితోడు ఈసీ నిఘా.. వీటన్నంటికి చెక్ పెడుతూ నయా రూట్ ఎంచుకున్నారట. ఎవరికైనా మద్యం బాటిల్ ఇవ్వాలంటే వారికి ఓ "పది నోటు" ఇచ్చేస్తున్నారట. అది తీసుకెళ్లి ఫలానా వైన్ షాపులో ఇచ్చేసి ఫుల్ బాటిల్ పట్టుకెళ్లమని చెబుతున్నారట. దీంతో అది తీసుకెళ్లి ఆ వైన్ షాపులో ఇస్తే వారు ఆ పది నోటు సీరియల్ నెంబర్ చూసుకుని లిక్కర్ ఇచ్చేస్తున్నారట. అంటే అంతకుముందే వారికి ఫోన్ లో సమాచారం గానీ, మేసేజ్ రూపంలో గానీ ఆ సీరియల్ నెంబర్ చేరుతోందన్నమాట. అయితే వారు ఇచ్చేది మాత్రం చీప్ లిక్కర్ కాదు సుమా! మంచి బ్రాండే. ఇదంతా కూడా హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో జరిగిన తంతు.

నోటుకో రేటు.. లిక్కర్ రేంజ్

నోటుకో రేటు.. లిక్కర్ రేంజ్

పది నోటుకు ఒక రేటు బాటిల్.. యాభైకి మరో రేటు బాటిల్ ఇలా కరెన్సీకి తగ్గట్టుగా లిక్కర్ రేంజ్ "ఆరేంజ్" చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే వైన్ షాపు నిర్వాహకులు మళ్లీ ఆ 10, 50 నోట్లు ఏవైతో తీసుకున్నారో వాటిని ఆయా నేతలకు ఇస్తే ఫుల్ అమౌంట్ వీరికి వచ్చేస్తుందన్నమాట. చూశారా ఎలా ప్లాన్ చేశారో మరి. ఎంత ప్లాన్ చేసినా కూడా ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంది కదా. చివరకు అదే జరిగింది. ఆనోట ఈనోట పోలీసుల చెవిన పడటంతో రంగంలోకి దిగి వారి ఆట కట్టించినట్లు సమాచారం.

English summary
The Liquor is flowing as river. Police were caught litres of liquor. some leaders are taking precautions to distributing the liquor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X