• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆమె ఫోన్ నెంబర్ సెక్స్ సైట్లోొ పెట్టింది అల్లుడే.. అత్త ఫిర్యాదుతో బయటకి వచ్చిన బాగోతం!

|

హైదరాబాద్‌ : కాలం మారింది. మనుషులు మారిపోతున్నారు. బంధాలు మరచిపోయి క్రూరంగా ఆలోచిస్తున్నారు. సొంతింటిలోనే కుంపట్లు పెట్టే రకాలుగా తయారవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. అత్త మీద కోపంతో అల్లుడు చేసిన ఘనకార్యం రచ్చకెక్కింది. ఆమెను ఇబ్బంది పెట్టబోయి చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

కాపురం సరిదిద్దుకోవాలంటూ అత్త చెప్పిన మాటలు ఆయనకు కంటగింపుగా మారాయి. చీటికిమాటికీ అత్త సోదేంది అనుకున్నాడో ఏమో గానీ ఆమె ఫోన్ నెంబర్ పదిమందికి తెలిసేలా చెత్తగా ఆలోచించాడు. దాంతో ఆమెకు లేనిపోని కాల్స్ వచ్చి ఇబ్బందికరంగా మారింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొదట ఎవరో ఆకతాయిల పని అనుకున్నా.. చివరకు అల్లుడే ఇలాంటి గిల్లుడు పని చేశాడని నిర్ధారించి కటాకటాల్లోకి తోసేశారు. చదువుకోని వారి కంటే బాగా చదువుకున్నోళ్లే ఇలాంటి ఘటనల్లో నిందితులుగా మారుతున్నారు. ఈ క్రైమ్ స్టోరీలోని విలన్ కూడా బాగా చదువుకున్నోడే కావడం గమనార్హం.

లేడీస్ జర భద్రం: దగ్గరి వారే సైకోలైతే.. మీ ఫోన్ నెంబర్ సెక్స్ సైట్లలో ఉంటుంది!

కాపురంలో జోక్యం.. అత్తమీద అల్లుడి కోపం..!

కాపురంలో జోక్యం.. అత్తమీద అల్లుడి కోపం..!

అత్త మీద కోపం పెంచుకున్నాడు ఓ అల్లుడు. మాటిమాటికీ తమ కాపురంలో అత్త జోక్యం ఎక్కువైందనేది అతడి ఫీలింగ్. దాంతో చేయకూడని పని చేశాడు. కలల దరిదాపులకు రాని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమెను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో అడ్డదారి ఎంచుకున్నాడు. దాంతో అల్లుడి లీలలు తెలియక సదరు అత్త చాలా ఇబ్బందులు పడింది. ఎవరికి చెప్పుకోలేక నరకయాతన అనుభవించింది.

తన మీద ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు అల్లుడు. అత్త మీద కసితో రాంగ్ రూట్‌లో వెళ్లాడు. అసలు ఏం జరుగుతుందో తెలియక అత్త చాలా కంగారు పడింది. చివరకు అల్లుడే తనను ఇబ్బంది పెట్టేందుకు అలాంటి పనిచేశాడని ఠాణా మెట్లెక్కింది.

మంచి చదువు.. ఉన్నతోద్యోగం.. చిల్లర వేషాలు

మంచి చదువు.. ఉన్నతోద్యోగం.. చిల్లర వేషాలు

వరంగల్ జిల్లా కమలాపూర్‌ వాసి దుబాసి సునీల్ బాగా చదువుకున్నారు. ఆయన విద్యార్హతలకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించారు. ఎన్టీపీసీ‌లో డిప్యూటీ మేనేజర్‌గా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి సంసారం కొన్నాళ్ల పాటు సజావుగా సాగినా.. రానురాను కల్లోల కాపురంగా తయారైంది.

భార్యభర్తల గొడవ సునీల్ అత్తగారింటికి చేరింది. మాటిమాటికీ ఆయన వేధిస్తున్నారనేది భార్య ఫిర్యాదు. ఆ క్రమంలో ఏంటీ ఈ గొడవలంటూ అత్త జోక్యం చేసుకుని మాట్లాడేవారు. అలా భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన ప్రతిసారి అత్త ఎంట్రీ ఇచ్చేవారు. దాంతో అత్తపై ఎక్కడాలేని కోపం పెంచుకున్నారు సునీల్.

లెక్కకు మించి ఫోన్ కాల్స్.. లైంగిక వేధింపులు

లెక్కకు మించి ఫోన్ కాల్స్.. లైంగిక వేధింపులు

తమ కాపురంలో అత్త జోక్యమేంటనేది సునీల్ తెగ ఫీలయ్యేవారట. దాంతో ఆమెపై పగ పెంచుకున్నారు. ఆమెను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ క్రమంలో అశ్లీల వెబ్‌సైట్లలో అత్త ఫోన్ నెంబర్ ఎక్కించేశారు. అమ్మాయిలు కావాలంటే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయాలనేది దాని సారంశం. అత్త ఫోన్ నెంబర్‌ను అలా అశ్లీల వెబ్‌సైట్లలో పొందుపరచడంతో.. ఆమెకు వీపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి.

ఫోన్ కాల్స్ చేస్తూ.. అమ్మాయిలు కావాలంటూ కొందరు విసిగించేవారు. ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు తనకు పదేపదే ఫోన్ చేయడం.. అమ్మాయిలు ఉన్నారా అంటూ నానారకాలుగా ఇబ్బందులు పెట్టడం ఆమెకు తలనొప్పిగా మారింది. కొందరైతే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ రాయలేని పదజాలంతో లైంగికంగా వేధించేవారట. దాంతో తీవ్ర మానసిక క్షోభకు గురై చివరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టడంతో అది ఆకతాయిల పని కాదని.. సొంత అల్లుడే ఇలా చేశాడని తేల్చారు. అత్త ఫిర్యాదు మేరకు అల్లుడిని అరెస్టు చేశారు.

English summary
In Hyderabad, one son in law made revenge on his aunty. She interfeared in his family disputes. Every Time she supported her daughter. Then son in law thinks for revenge. He puts his auntys phone number in porn sites. She received many calls with abused language. She complaints to cyberabad police on her issue. Police were investigated and they concluded that her son in law goes in wrong way, then arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more