హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ పీసీసీ చీఫ్: పూర్తయిన అభిప్రాయ సేకరణ, ప్రకటించడమే తరువాయి..

|
Google Oneindia TeluguNews

టీ పీసీసీ చీఫ్ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేతలు/ శ్రేణుల అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ తీసుకున్నారు. నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఉండి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఎవరనే అంశానికి సంబంధించి నివేదిక రూపొందించారు. రిపోర్ట్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అప్పగించారు. వారు పీసీసీ చీఫ్ ఎవరనే అంశాన్ని ప్రకటించనున్నారు. గత కొద్దీకాలంగా నెలకొన్న సస్పెన్షన్‌కు తెరతీయనున్నారు.

Recommended Video

TPCC Post Competition: Telangana Congress లో ఉత్కంఠ.. రేవంత్ రెడ్డికే టీపీసిసి అవకాశం..!!

పీసీసీ చీఫ్‌గా ఎవరోచ్చిన సంపూర్ణ సహకారం, ఉత్తమ్ హాట్ కామెంట్స్పీసీసీ చీఫ్‌గా ఎవరోచ్చిన సంపూర్ణ సహకారం, ఉత్తమ్ హాట్ కామెంట్స్

ఎవరికీ దక్కెను..

ఎవరికీ దక్కెను..

పీసీసీ చీఫ్ ఎవరనే అంశానికి సంబంధించి మానిక్కం ఠాగూర్ అభ్యర్థిని ఖరారు చేసినట్టు సమాచారం. సమావేశం తర్వాత ఉత్తమ్ కంగ్రాట్స్ చెప్పడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ సోనియా ప్రకటించేవరకు ఉత్కంఠ మాత్రం కొనసాగనుంది. కానీ ఎవరికీ అప్పగించిన అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఇదే మాటను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు.

అందరీ అభిప్రాయాలు తీసుకొని..

అందరీ అభిప్రాయాలు తీసుకొని..

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి కూడా మానిక్కం ఠాగూర్ అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు, కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థుల నుంచి విడివిడిగా సమావేశం అయ్యారు. నేతల అభిప్రాయాల నివేదికను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మానిక్కం ఠాగూర్ స్వయంగా ఇస్తారు. తర్వాతే కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వీరిద్దరేనా..

వీరిద్దరేనా..

టీ పీసీసీ పదవీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పోటీ ఉంది. వీరిలో ఎవరికీ ఇస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కోమటిరెడ్డి అంటే హై కమాండ్ మొగ్గుగా ఉంది అని తెలుస్తోంది. కానీ కొందరు రేవంత్ రెడ్డి పేరు చెబుతున్నారు. కాంగ్రెస్ మార్క్ అంతర్గత కుమ్ములాటలు, గొడవలు ఉండనే ఉన్నాయి. దీంతో ఎవరికీ ఇచ్చినా.. అలకలు, దూరంగా ఉండటం సహజమేనని మరికొందరు అంటున్నారు.

English summary
sonia gandhi will be announe t pcc chief congress party sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X