హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్‌గానే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

speaker pocharam srinivas reddy infected corona virus

గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోచారం కోరారు. లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. స్పీకర్‌కు కరోనా సోకడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,348 శాంపిల్స్ పరీక్షించగా, 406 మందికి పాజిటివ్ వచ్చింది.

హైదరాబాద్‌లో 177, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వచ్చాయి. ఇంకా 581 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,667 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 3,095 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.

English summary
telangana speaker pocharam srinivas reddy infected corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X