హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Priyanka Reddy murder:ప్రియాంకా హత్యోదంతంపై కేంద్రం ఆరా:కేసీఆర్ కు ఫోన్..శిక్ష పడేలా: కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేస్తోన్న వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యోదంతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంకా రెడ్డి హత్యోదంతాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Priyanka reddy murder:మహిళ వైద్యురాలికి కరవైన భద్రత: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్Priyanka reddy murder:మహిళ వైద్యురాలికి కరవైన భద్రత: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

నిందితులకు కఠిన శిక్ష పడేలా..

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యకు కారణమైన వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తాము తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల భోజన విరామ సమయంలో కొందరు విలేకరులు కిషన్ రెడ్డిని కలిశారు. ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని, ఇప్పటికే తమ మంత్రిత్వ శాఖ అధికారులు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారని అన్నారు.

Speaking to state govt and Police to get culprits capital punishment, says G Kishan Reddy on Priyanka murder case

నిర్భయ చట్టం తెచ్చిన తరువాత కూడా..

ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసుల నుంచి హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందిందని అన్నారు. ప్రధాన నిందితుడిగా తెలంగాణ నారాయణ పేటకు చెందిన మహమ్మద్ పాషాగా గుర్తించినట్లు వెల్లడించారని చెప్పారు. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తనకు సమాచారం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్భయ చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత కూడా ఇలాంటి ఘాతుకాలు తరచూ చోటు చేసుకుంటూండటం బాధాకరమని అన్నారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested

English summary
Union Home Minister for States G Kishan Reddy, A veterinary doctor Priyanka Reddy was raped and murdered in Hyderabad. Speaking to state govt and Police to get culprits capital punishment. It's a matter of grave worry that a woman was subjected to such brutality, says We'll give sufficient assistance from centre where needed, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X