హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ అనూహ్య యోచన - సోమ, మంగళవారాల్లో ప్రత్యేక అసెంబ్లీ - జీహెచ్ఎంసీ చట్ట సవరణ

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు త్వరలో జరుగనుండగా కేసీఆర్ సర్కారు కీలక చట్టసవరణ చేయనుంది. జీహెచ్ఎంసీ యాక్ట్ తోపాటు ఇతర చట్టాలకు సవరణలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను సైతం నిర్వహించే దిశగా ఆలోచనలు చేస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది.

అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్

''జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్నందున వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది'' అని సీఎంవో పేర్కొంది.

special assembly session on 12th, 13th oct for amendments to the GHMC Act

మరోవైపు డిసెంబర్ చివరివారంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ఎన్నికల కమిషన్.. ఆ మేరకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోలింగ్‌ను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించిన దరిమిలా 30 వేల బ్యాలెట్ బాక్సులు సేకరించే పనిలో పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంపిన బ్యాలెట్ బాక్సుల్ని తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్, బ్యాలెట్‌ బాక్సుల నోడల్ అధికారిగా వ్యవహరిస్తోన్న ఎన్. యాదగిరిరావు తెలిపారు.

ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్

గురువారం నాటికి ఏపీలోని ఏడు జిల్లాల నుంచి 17,366 బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చినట్లు యాదగిరిరావు తెలిపారు. విశాఖప‌ట్నం జిల్లా నుంచి 7111, చిత్తూరు నుంచి 5458, అనంత‌పురం నుంచి 357, ప్రకాశం నుంచి 841, నెల్లూరు నుంచి 1300, తూర్పుగోదావ‌రి నుంచి 449, క‌డ‌ప నుంచి 1850 బ్యాలెట్ బాక్స్‌లు వ‌చ్చిన‌ట్లు వివరించారు. మిగిలిన 12,634 బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్ల యాదగిరి రావు చెప్పారు.

English summary
telangana Government is contemplating to convene Legislative Assembly on coming 12tha and 13tha october. Apart from making amendments to the GHMC Act, the Government needed to make laws as per the directions of the High Court. A final decision on the matter is likely to be taken on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X