హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి పండగ.. రాష్ట్రంలో 3380 బస్సులు.. ఏపీకి 1600 సర్వీసులు

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో సందడే సందడి. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల ఆటపాటలు బిజీగా ఉండగా.. మహిళలు పిండి వంటలు చేస్తూ సందడిగా కనిపిస్తారు. ఇక మగాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ కోడి పందేలు ఉంటే అక్కడ వాలుతారు. పందేం కాస్తూ.. తీరికలేకుండా గడుపుతారు. ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు. ఏపీ చేరుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు నడుపుతామని రీజినల్ మేనేజర్ వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు 1,600 ప్రత్యేక బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని రీజినల్ మేనేజర్ వర ప్రసాద్ పేర్కొన్నారు.

special buses from telangana to andhra pradesh

ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి జనం చేరుకున్నారు. కరోనా వల్ల చాలా మంది వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటి వద్దే ఉన్నారు. ఆఫీసులకు వెళ్లే కొద్దీ మంది.. హైదరాబాద్‌లో ఉంటోన్న వారు మాత్రమే బస్సు సర్వీస్ సేవలను ఉఫయోగించుకుంటారు. కరోనా వల్ల చాలా మంది కార్లు/ క్యాబ్‌లనే ఆశ్రయిస్తున్నారు. స్పెషల్ బస్సు సర్వీస్ రేట్ కూడా ఎక్కువ ఉండనుంది.

English summary
special buses from telangana to andhra pradesh eve of sankranthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X