అకౌస్టిక్ కెమెరా.. ఇదీ ఏం చేస్తుందంటే.. ఇక వారికి చుక్కలే, ఫస్ట్ సిటీలో అమలు
సౌండ్ పొల్యూషన్.. వల్ల ఇబ్బందే. గ్రామాలు, పట్టణాల సంగతి ఏంటో గానీ.. హైదరాబాద్ మహానగరంలో అయితే రోడ్డు పక్కన ఉన్నవారికి చిరాకు. దీనిపై చర్యలకు సిద్దమవుతోంది. ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్దం చేశారు. ఏ వాహనం నుంచి సౌండ్ వస్తుందో.. చూసి, కెమెరా.. వీడియో తీసే అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేశారు. మరో 3 వారాల్లో హైదరాబాద్‌లో ఈ కెమెరాలు పనిచేయనున్నాయి.
అకౌస్టిక్ కెమెరా
సౌండ్ పొల్యూషన్ నియంత్రించడంపై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ చేశారు. సిటీలో అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. రహదారులపై హారన్ మోగించేవారిని కెమెరాలు పసిగడతాయి. హారన్ శబ్ధం ఆధారంగా ఏ వైపు వాహనం నుంచి సౌండ్ వచ్చిందో కెమెరాలు గుర్తిస్తాయి. ఆ వైపు తిరిగి ఫొటో, వీడియో తీస్తాయి.
నగరంలోని రోడ్లపై మరో మూడు వారాల్లో ఇవి పనిచేస్తాయి. నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ నాంపల్లి ట్రాఫిక్ కాంప్లెక్స్ వద్ద కెమెరా ట్రయల్ రన్ నిర్వహించారు. వీటిని ఏర్పాటుచేశాక... హారన్ నిబంధనలు ఉల్లంఘించేవారికి రూ.వెయ్యి జరిమానాతోపాటు, ఎక్కువ చలానాలు నమోదయ్యే వాహనాలపై కేసులు, చార్జిషీట్లు నమోదు చేస్తామని రంగనాథ్ తెలిపారు.
సిటీలో ఏర్పాటు
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్‌ను హారన్ మోతలు లేని సిటీగా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కెమెరాకు మైక్రోఫోన్, హెచ్డీ కెమెరా, డిస్ప్లే స్ర్కీన్, ఫ్లాష్ ఉంటాయి. వాహనాలను ఈజీగా గుర్తించి ఫోటో తీసే ఎత్తులో కెమెరాలు అమర్చి ఉంటాయి.
హారన్ కొట్టేవారిని, నిషేధిత ప్రాంతాల్లో హారన్లు కొట్టి శబ్ధ కాలుష్యం చేసే వారిని కెమెరా గుర్తిస్తుంది. హారన్ శబ్ధం రాగానే కెమెరాలో ఉన్న మైక్రోఫోన్ లెవెల్ పెరుగుతుంది. దాంతో శబ్ధం వచ్చే వాహనం దిశలో కెమెరా టర్న్ అవుతుంది. వాహనం, నెంబర్ ప్లేట్లను ఫోటో తీయడమే కాకుండా.. ఆధారాల కోసం రెండు మూడు సెకన్ల వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. దీంతో హారన్ కొట్టేవారు దొరుకుతారు.

ఫోటో.. వీడియో తీసి
ఆ వెంటనే ఆ ఫోటో, వీడియో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. సదరు వాహనదారుడిపై చర్యలు ఉంటాయి. వాహనదారుల్లో అవగాహన కల్పించి హారన్ల వినియోగాన్ని తగ్గించడమే తమ లక్ష్యం అంటున్నారు. అధికంగా సౌండ్ వచ్చే ఎయిర్ హారన్లను తొలగిస్తామని తెలిపారు. ఇదీ సిటీలో తొలుత అమలు చేస్తామని తర్వాత.. టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించే యోచనలో ఉంది. అకౌస్టిక్ కెమెరాతో సౌండ్ పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.