హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ పట్టభిషేకానికి ముమూర్తం ఖరారు..! కేసీఆర్ ఏం చెబుతున్నారు : మంత్రుల తాజా వ్యాఖ్యల వెనుక..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కేటీఆర్ పట్టాభిషేకానికి సమయం సమీపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందు కోసం ఆయన మానసికంగా పార్టీ నేతలు సైతం సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా మంత్రులు..సీనియర్ నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఈ వ్యూహంలో భాగమే. దీని ద్వారా పార్టీలో నేతల మూడ్.. కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే ఎదరు య్యే పరిణామాలను అంచనా వేయటానికి వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలని తెలుస్తోంది.

తాజాగా..ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ నేతలు చెబుతున్న విషయాలు కూడా కేటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. అయితే, ముహూర్తం పైనా ఇప్పిటికే ముఖ్యమంత్రి ఒక అంచనాకు వచ్చినప్పటికీ...ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో..ఆ తరువాత ఈ విషయం పైన పార్టీలో విధానపరమైన ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలుఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలు

ముఖ్యమంత్రి వ్యాఖ్యల పరమార్ధం ఇదేనా..

ముఖ్యమంత్రి వ్యాఖ్యల పరమార్ధం ఇదేనా..

కొద్ది రోజులుగా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పార్టీ నేతలు పోటీ పడీ మరీ ప్రకటనలు చేస్తున్నారు. అందుకు ప్రధానంగా ముఖ్యమంత్రి కొందరి వద్ద చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటు తాను చేయరాదని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ ను యూపిఏ-1 లో మంత్రిగా చేసి ఉంటే...యూపీఏ-2 లో ప్రధానిగా చేసే అవకాశం ఉండేదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ సాధన..కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వటంతో ఇక తెలంగాణలో పాలన పట్టాలెక్కిందని...దానంతట అదే ముందుకు సాగుతుందని కేసీఆర్ అంటున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా తన వారసుడికి పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా మంత్రులు వరుస పెట్టి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారని సమాచారం.

మరి..కేసీఆర్ ఏం చేస్తారు..

మరి..కేసీఆర్ ఏం చేస్తారు..

కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వాస్తవంగా..రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలోనే ప్రచారం సాగింది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదట కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పంచాయతీ, పరిషత్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ను విజయ పథంలో నడిపించారని పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అభినందించారు. ఇక, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో కేటీఆర్‌ అన్నీ తానే అయి నిర్వహించడాన్ని పార్టీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తానే సీఎంగా కొనసాగుతానని సాక్షాత్తూ అసెంబ్లీలోనే కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కేటీఆర్‌ కూడా వ్యాఖ్యానించారు.కానీ, కేసీఆర్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే..ఆయన రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సలహ మండలి ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా ఉంటారంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది.

 ముహూర్తం సైతం ఖరారైందంటూ..

ముహూర్తం సైతం ఖరారైందంటూ..


కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమంటూ..ముహూర్తంపైనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టాక పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తు న్నాయి. అధికారం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం లాంఛనమేనని, ఆ తర్వాత కేటీఆర్‌ పట్టాభిషేకం ఉంటుందని పార్టీ ముఖ్యులు వివరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, విద్యుత్తు సహా వివిధ చార్జీలను పెంచితే తప్ప గాడిలో పడే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో..అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చార్జీల పెంపు నిర్ణయాలు తీసుకుని.. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఆ తర్వాత పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించవచ్చని మరికొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు..కేటీఆర్ కు పెరుగుతున్న ప్రాధాన్యత..జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే...త్వరలోనే కేటీఆర్ కు పగ్గాలు అప్పగించటం ఖాయమని పార్టీ నేతలు బలంగా వాదిస్తున్నారు.

English summary
Specualtions started in TRS that shortly KTR will become CM in place of KCR. Party leaders sharing opinion that KTR playing crucial role in party and govt. He ix capable for CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X