హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ శ్రావణి కథ: ఏ-3 నుంచి ఏ-1గా దేవరాజ్.. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు నో.. తర్వాతే..

|
Google Oneindia TeluguNews

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. దేవరాజ్, సాయికృష్ణల వేధింపుల వల్లే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం కొన్ని మార్పులు చేశారు. ఏ-1 నుంచి ఏ-3 పేర్లను మార్చివేశారు. కేసు విచారణ క్రమంలో.. రిమాండ్ రిపోర్ట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.

 ఓ శ్రావణి కథ..అజ్ఞాతం వీడని అశోక్ రెడ్డి.. మొబైల్ స్విచాఫ్, కాల్ డేటా ఆధారంగా.. ఓ శ్రావణి కథ..అజ్ఞాతం వీడని అశోక్ రెడ్డి.. మొబైల్ స్విచాఫ్, కాల్ డేటా ఆధారంగా..

రిమాండ్ రిపోర్టు మార్పు..

రిమాండ్ రిపోర్టు మార్పు..

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ కేసులో ఏ-3 ముద్దాయిగా ఉన్న దేవరాజ్ పేరును రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా మార్చారు. అలాగే సాయికృష్ణారెడ్డిని ఏ-1 నుంచి ఏ2గా, ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డిని ఏ3గా మార్చారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను విచారించామని పోలీసులు పేర్కొన్నారు. దేవరాజ్‌ను ప్రేమించానని శ్రావణి తన కుటుంబ సభ్యులకు చెప్పిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. శ్రావణికి సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డితో సంబంధం ఉండడంతో దేవరాజ్ అందుకు అంగీకరించలేదని.. అందుకే గొడవలు జరిగాయని వెల్లడించారు.

శ్రావణికి బెదిరింపులు..

శ్రావణికి బెదిరింపులు..

శ్రావణి దేవరాజ్‌ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన సాయి, అశోక్‌ శ్రావణిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ నెల 7వ తేదీన అజీజ్ నగర్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రావణిని దేవరాజ్ అక్కడి నుంచి తీసుకొని పోయాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్‌‌లో లంచ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన సాయి శ్రావణిపై చేయి చేసుకుని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. దేవరాజ్‌ను కలవవద్దని సాయి, అశోక్‌ కలిసి బెదిరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

దేవరాజ్‌ను చంపేస్తామని బెదిరింపులు..?

దేవరాజ్‌ను చంపేస్తామని బెదిరింపులు..?

దేవరాజ్‌ను చంపేస్తామని, ఆర్థికంగా ఆదుకోబోమని శ్రావణిని వారిద్దరూ బెదిరించారు. లాభం లేదనుకొని శ్రావణి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోదామని దేవరాజ్‌ను అడిగింది. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ అంగీకరించకపోవడంతో సమస్య వచ్చింది. ఇటు సాయి, అశోక్‌ వేధింపులు.. దేవరాజ్ వచ్చేందుకు అంగీకరించకపోవడంతో శ్రావణి మనోవేదనకు గురయ్యిందని, అందుకోసమే ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

సినిమాల్లో నటించాలని వచ్చి..

సినిమాల్లో నటించాలని వచ్చి..


కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన శ్రావణి.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు తన ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అశోక్ రెడ్డిని పరిచయం చేశాడు. ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాలో శ్రావణికి చిన్న రోల్ కూడా ఇప్పించారు. అలా శ్రావణితో సాయి పరిచయం కొనసాగింది. తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ అవకాశం రావడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆమె పేరంట్స్, బ్రదర్ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే వారితో కూడా సాయికి పరిచయం ఏర్పడటంతో.. క్రమంగా ఇంటికి కూడా వచ్చేవాడు.

Recommended Video

Telangana Assembly Sessions: ACP Vishnu Murthi About Police Key Role | Oneindia Telugu
పోలీసుల అదుపులో ముగ్గురు

పోలీసుల అదుపులో ముగ్గురు

గతేడాది టిక్ టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ పరిచయం అయ్యాడు. అయితే వారి ప్రాంతం కావడంతో.. శ్రావణి అతనితో చనువుగా ఉంటేంది. కొద్దిరోజులు ఆమె ఇంట్లో కూడా ఆశ్రయం కల్పించింది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం.. సాయికి నచ్చలేదు. గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరడంతో.. దేవరాజ్ శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆ రోజు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిచారని, దాడి చేశారని శ్రావణి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆడియోలో ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

English summary
sravani suicide case:devraj is a-1 accused in the case police report in remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X