• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీ కృష్ణ జన్మాష్టమిపై వివాదం.. శుక్రవారమా, శనివారమా..?

|
  ఇంతకీ పండుగ శుక్రవారమా,శనివారమా | Sri Krishna Ashtami Controversy Either Festival Friday Or Saturday

  హైదరాబాద్ : స‌ృష్టికర్త మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదవ అవతారంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని చెబుతారు. ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిగా పిలుస్తుంటారు. అయితే ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుక్రవారం జరుపుకోవాలా లేదంటే శనివారం జరుపుకోవాలా అనేది భక్తులకు పెద్ద సంశయంగా మారింది. ఆ క్రమంలో కాస్తా వివాదస్పదంగా మారినట్లు కనిపిస్తోంది వ్యవహారం. ఇస్కాన్ టెంపుల్ అధికారికంగా శనివారం నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రకటించింది. అయితే కొందరేమో శుక్రవారమే పండుగ అంటూ ప్రచారం చేయడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

  శుక్రవారమా, శనివారమా.. ఇంతకు జన్మాష్టమి ఎప్పుడు..!

  శుక్రవారమా, శనివారమా.. ఇంతకు జన్మాష్టమి ఎప్పుడు..!

  శ్రీ కృష్ణ జన్మాష్టమి ఈ సంవత్సరం కాస్తా గందరగోళానికి దారి తీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం నాడు పండుగ అని స్మార్తులు అంటుంటే.. వైష్ణవ సంప్రదాయ ప్రకారం 24వ తేదీ శనివారం జన్మాష్టమి అని చెబుతున్నారు. ఈ రెండు తేదీల కారణంగా ఇంతకు పండుగ ఎప్పుడు అనేది చాలామందికి కన్ఫ్యూజన్‌గా మారింది.

  ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుక్రవారమా, శనివారమా అనేది చాలామందికి చాలా రకాలుగా అనుమానాలున్నాయి. ఇదివరకు కూడా కొన్ని పండుగల విషయంలో తర్జనభర్జన పడ్డ సందర్బాలున్నాయి. దసరా, ఉగాది లాంటి పండుగలు రెండు రోజులు అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు తికమకపడ్డారు. ఆ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన పెద్ద పండితులు చెప్పిన ప్రకారం ఏదో ఒక రోజు పండుగ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పండితులు రకరకాలుగా చెప్పిన క్రమంలో రెండు రోజులు పండుగ చేసుకోక తప్పలేదు.

  అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం

  శనివారం నాడే పండుగ.. ఈస్కాన్ ప్రకటన..!

  శనివారం నాడే పండుగ.. ఈస్కాన్ ప్రకటన..!

  శ్రీ కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు అనేది భక్తుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఈస్కాన్ మాత్రం అధికారంగా శనివారం నాడే పండుగ అని నిర్ధారించింది. ఆ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇంతకు పండుగ శుక్రవారమా లేదంటే శనివారమా అనే మీమాంస మాత్రం జనాలను ఆందోళనకు గురిచేసినట్లు కనిపించింది. ప్రభుత్వ సెలవు శుక్రవారం నాడు లేకపోవడం కూడా కొంత గందరగోళానికి గురిచేసిందని చెప్పొచ్చు.

  పండుగ రెండు రోజులు ఆనవాయితేనా?

  పండుగ రెండు రోజులు ఆనవాయితేనా?

  శ్రీ కృష్ణ జన్మాష్టమి శ్రావణమాసంలో వచ్చే అష్టమి రోజున జరుపుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజే కృష్ణుడు జన్మించాడని.. పుట్టిన నక్షత్రం రోహిణి అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ పండుగను రెండు రోజులు జరుపుకోవడం ఇప్పుడేమీ కొత్త కాదంటారు కొందరు. ఆనవాయితీగా వస్తున్న ఆచారమే అంటుంటారు.

  ఇలా రెండు రోజులు ఎందుకు జరుపుతారనేది పెద్ద ప్రశ్న. అయితే రోహిణి నక్షత్రం, అష్టమి రెండు ఒకటే రోజు రాకపోవచ్చని చెబుతుంటారు. అదే క్రమంలో పండుగ గనక రెండు రోజులు అని చెబుతుంటే అందులో ముందు రోజు కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అంటారు. ఆ మరుసటి రోజును కాలాష్టమిగా పరిగణిస్తారట.

  ఎలుకలు బాబోయ్.. అక్కడ భయపడటం లేదు.. కొనుక్కొంటున్నారు..!

  స్మార్తులు అలా.. వైష్ణవులు ఇలా..!

  స్మార్తులు అలా.. వైష్ణవులు ఇలా..!

  హిందూ సంప్రదాయంలో కృష్ణుడికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మాతృమూర్తులకు బాలకృష్ణుడిగా.. చిన్న పిల్లలకు చిలిపి కృష్ణునిగా, స్రీలకు గోపికా వల్లభుడిగా.. పెద్దలకు గీతాకారునిగా.. ఇలా వివిధ రూపాల్లో కొలువై ఉంటారు. అందుకే అందరు శ్రీ కృష్ణ జన్మాష్టమిని ప్రత్యేకంగా చూస్తారు. వేడుకలా జరుపుకుంటారు.

  అయితే ఈసారి పండుగ రెండు రోజులు ఏవిధంగా జరుపుకుంటారనేది ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం నాడు స్మార్తులు, 24వ తేదీ శనివారం నాడు వైష్ణవులు పండుగను జరుపుకుంటారట. స్మార్తులు తిథితో జన్మాష్టమి వేడుకలకు సిద్ధమైతే.. వైష్ణవులేమో నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తుంటారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that the Creator Maha Vishnu was born as Sri Krishna in the eighth incarnation to uplift the universe. His birthday is called Krishnashtami, Gokulashtami and Ashtami Rohini. However, this time Sri Krishna Janmashtami should be celebrated on Friday or Saturday, which has become a big concern for devotees.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more