హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ జన్మాష్టమి తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకం..! నగరంలోని స్వర్ణదేవాలయంలో ఘనంగా వేడుకలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు నగరం సిద్దమైంది. అన్ని దేవాలయాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు దేవాలయాల ప్రధాన అదికారులు. ఇక ఇస్కాన్ దేవాలయాలు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా ఆద్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. నందగోపాలుడి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పట్లు చేసారు దేవాలయాల సిబ్బంది. మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా హరే రామ హరే కృష్ణ పాటలతో బంజారాహిల్స్ లోని సర్ణ దేవాలయం మారుమ్రోగిపోతోంది. హరేకృష్ణ మూవ్ మంట్ మరియు అక్షయపాత్ర ఫండేషన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజి తెలిపారు. వన్ ఇండియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పవిత్రను తెలియజేసారు.

నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..! కళకళలాడుతున్న దేవాలయాలు..!!

నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..! కళకళలాడుతున్న దేవాలయాలు..!!

శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే హిందూ ప్రజలకు ఎంతో ఇష్టమైన వేడుక. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా, పరమ పవిత్రంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. వేర్వేరు రూపాల్లో వివిధ కార్యక్రమాల్లో పొందు పరిచిన గోపాల కృష్ణుడిని చూసి తరించుకునేందుకు భక్తులు ఎక్కువ సఖ్యలో పోటీ పడుతున్నారు.

 కృష్ట్నుడు పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు..! ముస్తాబైన గుళ్లు గోపురాలు..!!

కృష్ట్నుడు పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు..! ముస్తాబైన గుళ్లు గోపురాలు..!!

అంతే కాకుండా వేలాది మంది భక్తులు కృష్ణుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్ లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకులను ఆగష్టు 23, 24 మరియు 25వ తేదిలలో అత్యంత కన్నుల పండుగుగా నిర్వహించడానికి అన్పి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజి తెలిపారు.

మూడు రూపాల్లో శ్రీకృష్ణుడు..! భక్తుల సందర్శన కోసమే అంటున్న పండితులు..!!

మూడు రూపాల్లో శ్రీకృష్ణుడు..! భక్తుల సందర్శన కోసమే అంటున్న పండితులు..!!

అంతే కాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొనడానికి హైదరాబాద్ తో పాట్ల చుట్లు పక్కల ప్రాంతాల నంచి వేలాదిగా శ్రీకృష్ణ భక్తులు హాజరుకాబోతున్మారు.ఈ వేడుకలో ముఖ్య ఆకర్షణగా హరేకృష్ణ మూవ్ మంట్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్షయపాత్ర, ఫెష్కో(మిలెట్స్) యువత్ స్వశక్తీకరణ, బేసిల్స ఉడ్స్ లాంటి స్టాల్స్ ను దేవాలయ ప్రాంగణంలో ప్రదర్శన ద్వారా భక్తులు సందర్శించవచ్చును. ఈ ఏడాది స్వర్ణదేవాలయంలో జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలలో ఆ దేవాది దేవుడు శ్రీ రాధా గోవిందుడు, శ్రీ గోదా కృష్టులు మరియు వెన్న బాలకృష్టుడుగా మూడు రూపాలన దర్శించుకోవచ్చని శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజి తెలిపారు.

ఉంజల సేవ ఎంతో ప్రత్యేకం..! అన్నిశుభాలే అంటున్న ప్రధానార్చకులు..!!

ఉంజల సేవ ఎంతో ప్రత్యేకం..! అన్నిశుభాలే అంటున్న ప్రధానార్చకులు..!!

ఇక్కడకు విచ్చేసిన భక్తులందరికి వెన్న కృష్టుడు (లడ్డు గోపాలుడు) 'ఉంజల సేవలో' పాల్గొరనేలా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజి పర్యవేక్షణలో మూడు రోజులు పాటు అత్యంత నయనా నందకరంగా జరిగే వేడుకలకు వచే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుజీ సూచనలు, సలహాల మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కార్యక్రమాలు నిర్వహించబడతాయని దేవాలయ ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు.

English summary
The city was ready for the celebrations of Sri Krishna Janmashtami. In all the temples, Sri Krishna Janmashtami is being arranged for the celebration of the chief of the temples. ISKCON temples are in the temple of Sri Krishna Janmashtami. Nandagopaludi's birthday celebrations were made special, Temple staff. They are planning to conduct the celebrations for three days. In addition, the Swarna Temple in Banjara Hills is ringing with Hare Rama Hare Krishna songs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X