హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఎగ్జామ్స్ ఫీవర్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే: పరీక్షా కేంద్రాలు డబల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఎట్టకేలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎస్ఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. పరీక్షలను నిర్వహించడానికి సన్నద్ధమైంది కేసీఆర్ సర్కార్. కరోనా వైరస్ సోకకుండా విద్యార్థులు అన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరాన్ని పాటించడానికి పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేసింది. విద్యార్థులకు ఎలాంటి హానీ కలగకుండా పెద్ద ఎత్తున ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.

నాడు సీబీఐని నిషేధించి.. నేడు స్వాగతిస్తోన్న చంద్రబాబు: హైకోర్టు ఆదేశాలపై హర్షాతిరేకాలునాడు సీబీఐని నిషేధించి.. నేడు స్వాగతిస్తోన్న చంద్రబాబు: హైకోర్టు ఆదేశాలపై హర్షాతిరేకాలు

పదవ తరగతి పరీక్షలను వెంటనే నిర్వహించాలని కొద్దిరోజుల కిందటే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. వాయిదా పడిన పరీక్షలను కరోనా వైరస్ నిబంధనలకు లోబడి నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు మాస్కులను ధరించడం, పరీక్షా కేంద్రంలో ప్రవేశించడానికి ముందు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడాన్ని తప్పనిసరి చేశామని చెప్పారు.

SSC exam schedule released in Telangana, exams tobegin from June 8th

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహిస్తామని, భౌతిక దూరాన్ని పాటించడానికి వీలుగా పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇదివరకు 2530 కేంద్రాలు ఉండగా.. ఈ సారి వాటి సంఖ్యను పెంచామని అన్నారు. అదనంగా 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని, అదనంగా 26,422 మందిని దీనికోసం నియమించినట్లు పేర్కొన్నారు. కరోనా గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు.

Recommended Video

National Green Tribunal gives Stay On Pothireddypadu Head Regulator works

జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌, జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌, జూన్‌ 14న మేథమేటిక్స్ మొదటి పేపర్‌, జూన్‌ 17న మేథమేటిక్స్ రెండో పేపర్‌, జూన్‌ 20న భౌతిక శాస్త్రం మొదటి పేపర్‌, జూన్‌ 23న జీవశాస్త్రం రెండో పేపర్‌, జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌,
జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌, జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌ (సంస్కృతం. అరబిక్‌), జులై 5న ఒకేషనల్‌ కోర్సు థియరీ ఉంటుంది. పరీక్షలన్నీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు నిర్వహిస్తారు. విద్యార్థుల సౌకర్యం కోసం ప్రతి పరీక్ష మధ్య రెండు రోజుల వ్యవధిని తీసుకున్నారు.

English summary
Telangana Government has released SSC exam schedule on Friday. The Exams to begin from June 8, 2020. Exam centres doubled to maintain physical distancing in Coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X