హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్ లైన్ లో ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదగొచ్చు.!టీ సర్కార్ చేయూత ఉంటుందన్న కవిత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళకే అందిస్తూ, ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్ లో ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత, మహిళ చేతిలో ఆర్థిక నియంత్రణ ఉంటే బాగుంటుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా వెబినార్ లు నిర్వహిస్తున్న అశోకా యూనివర్సిటీ, వీ హబ్ లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. రాజకీయ నాయకులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇతర దేశాల మాదిరిగా ఇండియాలో సైతం వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా అవినీతి రహిత విధానాలు రూపొందించాలని, ఉన్నత విద్యను సైతం సహకారాలు అందించాలన్నారు.

Recommended Video

#ktr ఒక్క సెల్ఫీ బిడ్డా.. ! వృద్ధురాలి ప్రేమకు మంత్రి కేటీఆర్ ఫిదా
 Start online and grow internationally!MLC Kavitha

అంతే కాకుండా దేశంలో పాలసీ పరంగా పరిమితులు ఉన్నాయని ఎవ్వరూ భావించొద్దని, ఆన్ లైన్ లో వ్యాపారం ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదిగేందుకు సైతం అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండియాలో 90 శాతం స్టార్టప్ లు టీం మేనేజ్ మెంట్ లేక ఫెయిల్ అవుతున్నాయని ఒక సర్వేలో తేలిందన్న ఎమ్మెల్సీ కవిత, స్టార్టప్ లు సక్సెస్ అవ్వాలంటే ఐడియాతో పాటు, టీం మేనేజ్ మెంట్ కూడా ముఖ్యమన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం, 33 శాతం మార్కెట్ కమిటీ పదవులు, షీ టీంలు, విద్యా సంస్థలు, పెన్షన్లు వంటి అనేక కార్యక్రామలతో మహిళల ఆర్థిక స్వావలంభన చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

English summary
MLC Kalvakuntla Kvitha says that many government schemes in Telangana are being funded and financed by women. Addressing a webinar jointly organized by Ashoka University and V-Hub, Kavitha said it would be good if women had financial control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X