హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేసవి సెలవులపై విద్యార్థి ట్వీట్.. 12 వరకు స్కూళ్లు తెరిచేది లేదన్న కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ప్రభుత్వ పాత ఉత్తర్వుల ప్రకారం జూన్ 1వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండాకాలం వేడిగాలుల దృష్ట్యా.. వేసవి సెలవులను మరో పదిరోజులు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు సెలవులు కొనసాగించి.. 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసేందుకు సిద్ధమయ్యాయి. పాత ఉత్తర్వుల ప్రకారమే జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

student tweet to on summer holidays ktr reacted as dont open till 12th

ఆసరా పింఛన్లు డబుల్.. జూన్ నుంచే అమలు.. ఉత్తర్వులు జారీఆసరా పింఛన్లు డబుల్.. జూన్ నుంచే అమలు.. ఉత్తర్వులు జారీ

ప్రభుత్వం వేసవి సెలవులు పొడిగించాలని ఉత్తర్వులు ఇస్తే.. తమ స్కూల్ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదనే విషయం కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు సదరు విద్యార్థి. జూన్ 12వ తేదీకి బదులు 1వ తేదీనే పాఠశాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోందని వివరించాడు.

జూన్ 1వ తేదీ నుంచి 12 వరకు ఒంటిపూట స్కూల్ నడిపేందుకు సిద్ధమయ్యారని.. ఆ మేరకు అందరికి మేసేజ్‌లు పంపించారని పేర్కొన్నాడు. ఎండ వేడికి బడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే సదరు విద్యార్థి ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల పొడిగింపును అమలు చేసేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు.

English summary
Telangana Government Extended school reopens date. Actually the school reopens date is june 1st. But in the view of summer heat, telangana government extended holidays to june 11th. Some schools neglecting the government orders. One of the student tweeted to ktr as his school management not following the state government orders. KTR responded and given instructions to education minister to implement summer holidays extension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X