హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ మంటలు : మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆందోళన పర్వం కొనసాగుతుంది. గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యంతో 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలైన సంగతి తెలిసిందే. దీంతో వారికి ఉచితంగానే రీ వాల్యుయేషన్ చేస్తున్నారు. అయినా బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

మిన్నంటిన ఆందోళనలు
బోర్డు నిర్లక్ష్యంపై ఇవాళ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఎక్ర్ గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు.

students leaders agitation at minister quarters

నేలరాలిన విద్య కుసుమాలు
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఫలితాల్లో తేడా వచ్చిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన కూడా చేపట్టారు. బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. ఫలితాల తేడాలో ప్రభుత్వం, బోర్డు నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. మరోవైపు బోర్డు, ప్రభుత్వ వైఖరితో ఆత్మన్యూనత భావానికి లోనైన విద్యార్థులు ఊపిరి వదిలారు. దాదాపు 26 మంది విద్యా కుసుమాలు ఫెయిలయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి ... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

English summary
About 3 lakh students are known to have been neglected by the globally. They are free to re-valuation. However, the student neglects the board's ignorance and government indifference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X